Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముందుగా పద్మాసనం, సుఖాసనం, వజ్రాసనంలోగాని కూర్చోవాలి. రెండు చేతులను రెండు మోకాళ్ళపై ఉంచాలి. కుడిచేయి బొటనవేలును, చూపుడు వేలిపై భాగాలను గోళ్ళు తగలకుండా కలపాలి. ఆ తర్వాత మధ్యవేలు, ఉంగరం వేలు, చిటికెన వేలును అరచేతి వైపు తిప్పాలి. ఇదేవిధంగా ఎడమ చేతిలో వేళ్ళను కలపాలి. ఇలా ఐదు నిమిషాల పాటు కండ్లు మూసుకొని మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా మనసంతా ముద్రపై ఉంచి కూర్చోవాలి. ఈ స్థితిలో శ్వాస సామాన్యంగా ఉండాలి.
ఉపయోగాలు..
ఒత్తిడి తగ్గుతుంది
జీర్ణక్రియ మెరుగవుతుంది
రక్తపోటు అదుపులో ఉంటుంది
నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు.
జాగ్రత్తలు..
ఈ ముద్ర అందరూ చేయవచ్చు.
- శ్రీచందన
డిజె ఫిట్నెస్ హబ్
9666665458