Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాస్త ధర ఎక్కువే కానీ, అడపాదడపా చారెడంత పిస్తాపప్పు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలని చెబుతున్నారు నిపుణులు. ఫైబర్, ప్రొటీన్ లెవల్స్ ఎక్కువగా ఉండే పిస్తాను ఏ రూపంలో తీసుకున్నా మంచిదే.
పిస్తాపప్పులో ఉండే విటమిన్-బి6 హిమోగ్లోబిన్‌ను పెంచడంలో దోహదం చేస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది.
చర్మ సౌందర్యం ఇనుమడింప జేయడంలోనూ పిస్తా మంచి గుణం కనబరుస్తుంది. ఇందులో ఉండే విటమిన్-ఇ చర్మానికి కాంతి తేవడంతో పాటు యువి కిరణాలను తట్టుకునే సామర్థ్యం కలిగిస్తుంది. స్కిన్ క్యాన్సర్‌ను నిలువరించే శక్తి దీనికి ఉంది.
విటమిన్-ఎ, ఇ పాళ్లు పిస్తాలో ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో వేడిని త్వరగా తగ్గిస్తాయి. నోరు పెచ్చడాన్ని పిస్తా త్వరగా అరికడుతుంది.
ఒబెసిటీ నుంచి కూడా పిస్తా రిలీఫ్‌నిస్తుంది. ఆకలిని అరికట్టడంతో పాటు శరీరంలోని కొలెస్టాల్ర్ శాతాన్ని తగ్గిస్తుంది. ఎముకలు, కండరాల దఢత్వాన్నీ పెంచుతుంది.
జీర్ణక్రియలో పిస్తా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇందులో సమద్ధిగా ఉండే కాపర్, మాంగనీస్, పాస్పరస్‌లు తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఉపయోగపడతాయి.