Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దోసకాయ ముక్కల్లో కొద్దిగా పెరుగు కలిపి రుబ్బాలి. గుజ్జు నుంచి రసాన్ని తీసి ముఖానికి రాసుకోవాలి. పదినిమిషాలయ్యాక కడిగేసుకుంటే మేనిరంగు తాజాగా మారుతుంది.
ఙ చర్మం టోనింగ్‌కి ఆరంజ్ జ్యూస్‌లోని విటమిన్ సి అద్భుతమైన టోనర్‌గా పనిచేస్తుంది. దీనిని ముఖంపై మర్దనా చేసినపుడు సబ్బుతో పోని అదనపు మలినాలు, మచ్చలూ తొలగిపోతాయి.
ఙటోనర్ తయారీకి సగం ఆరంజ్, సగం టీస్పూన్ నిమ్మరసం, ఒక కప్పు నీటిని బ్లెండ్ చేయండి. ఈ మిశ్రమం మదువుగా అయ్యే వరకు బ్లెండ్ చేయండి. దూదిని దానిలో ముంచి ముఖంపై అప్లై చేయండి.
- చర్మ సంరక్షణలో ఇది ఒక మంచి మూలిక. మొటిమలను నివారించడంలో లావెండర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది చర్మ ఛాయను బాగా మెరుగుపరుస్తుంది. కాబట్టి, లావెండర్ హెర్బ్‌ను నూరి పాలు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి.
- గ్రీన్ కలర్లో ఉన్న అవొకాడో పండును మెత్తగా పేస్ట్ చేసి కొద్దిగా పాలు చేర్చి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ముఖం, మెడకు పట్టించడం ద్వారా మంచి కలర్ పొందవచ్చు. ఈ ప్యాక్‌ను వారంలో రెండుసార్లు వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
- గుడ్డలోని తెల్లసొనలో చెంచా బాదం నూనె కలిపి ముఖం, మెడకు బాగా మర్దనా చేసుకోవాలి. పావుగంటయ్యాక చల్లటినీళ్ళతో కడిగేసుకుంటే పొడిబారిన చర్మానికి తేమ అందుతుంది
- మదువైన, శుభ్రమైన, మచ్చలు లేని ముఖవర్ఛస్సు కోసం ఒక చెంచా శెనగపిండి, ఒక చిన్న - స్పూన్ పసుపు (టర్మరిక్)తో మూడు చెంచాల పెరుగు కలపండి. గట్టిగా మదువైన పేస్ట్ వచ్చేవరకు కలపండి. ముఖం మొత్తం సమానంగా పూయండి. ఇరవై నిమిషాలు వదిలేయండి. తరువాత చల్లని నీటితో కడగండి.
- రెండు నిండు చెంచాల తాజా తేనెను ఒక చెంచా ఆలివ్ నూనెతో కలిపి మదువైన పేస్ట్ తయారు చేయండి. దానిని మీ జుట్టుపై మర్దన చేసి, జుట్టు కుదుళ్లతో ప్రారంభించి, జుట్టు చివర్ల వరకు చేయండి. తరువాత, ఈ మిశ్రమం మీ తలకు పట్టేటట్లు, షవర్ క్యాప్‌తో మీ జుట్టును చుట్టి ఉంచండి. 20 నిమిషాల తరువాత ఈ మిశ్రమాన్ని తొలగించడానికి సున్నితమైన హెర్బల్ షాంపూను వాడండి.
- కొత్తిమీర ఆకుల రసం పెదాలపై రాసి, మర్దన చేస్తే అవి గులాబీ రంగుతో,
మ దువుగా ఉంటాయి.