Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం మార్కెట్లో ఆలుబుకారా విరివిగా దొరుకుతుంది. ఇవి ఆరోగ్యానికే కాదు అందానికీ ఉపయోగపడుతాయి.
- యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆలుబుకారా పండ్లు తినడం వల్ల కేన్సర్ బారినపడే అవకాశం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వీటిలో ఉండే బీటాకెరోటెన్ అనే యాంటాక్సిడెంట్ ఊపిరి తిత్తులు, నోటి సంబంధ కేన్సర్లను దరిచేరనీయదు.
- ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి అవసరమయ్యే పొటాషి యం, ఫ్లోరైడ్, ఐరన్ వంటి ఖనిజాలు కూడా ఆలుబుకారాల్లో ఉంటాయి. వీటిలో ఉండే ఇతర యాంటాక్సిడెంట్లు, శరీరంలోని కణాలు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి. ఆలుబుకారా తింటే జీర్ణాశయ సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం, జ్వరానికి మంచి విరుగుడు ఇది మంచి మందులా పని చేస్తుంది. - కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ పండ్లను తినడంవల్ల బరువు పెరుగుతామనే చింతే ఉండదు. ఇందులోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకల దఢత్వాన్ని కాపాడే విటమిన్-కె పాళ్లు కూడా ఈ పండులో ఎక్కువే.
- ఎరుపు, నలుపు, నీలం రంగుల్లో దొరికే ఆలుబుకారా పండ్లతో జామ్, జ్యూస్, చట్నీలు తయారు చేసుకోవచ్చు. పిల్లలు ఎంతో ఇష్టపడే జెల్లీలు, కేకులు కూడా తయారుచేసుకోవచ్చు.
- కొంతమంది పెదవులు నల్లగా ఉంటాయి. అలాంటి వారు ఆల్బుకారా పండ్లను తీసుకోవడం ద్వారా పెదవుల అందాన్ని మెరుగుపరుచుకోవచ్చు. దీంతోపాటు ఆల్బుకార్ తొక్కతో పెదవులను కాసేపు సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే నల్లగా ఉన్న పెదవులు ఎర్రగా, మదువుగా తయారవుతాయి.
- మొటిమలను గిల్లడం, దెబ్బలు తగలడం లాంటి కారణాల వల్ల ఆయా ప్రదేశాల్లోని చర్మకణాలు పాడైపోతాయి. తిరిగి అక్కడ చర్మకణాలను ఉత్పత్తి చేయడానికి చర్మం కొలాజెన్ను ఉత్పత్తి చేస్తుంది. అయితే కొన్నిసార్లు కొలాజెన్ తక్కువగా విడుదలవడం వల్ల అక్కడ చర్మకణాలు పూర్తిగా ఏర్పడవు. ఫలితంగా మచ్చలు ఏర్పడతాయి. అయితే ఆల్బుకారాను తినడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు.
- ఆల్బుకారాలో ఉండే విటమిన్ 'ఇ', బీటాకెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు చర్మకణాలను ఫ్రీరాడికల్స్ బారినుంచి రక్షిస్తాయి. అలాగే దీనిలో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల, అవి వదులుగా మారిన చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి. ఫలితంగా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనిపిస్తుంది.