Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ సీజన్లో జామపళ్లు విశేషంగానే వస్తుంటాయి. జామ పళ్లలో కావాల్సినంత విటమిన్-సి ఉంటుంది. ఇది జీర్ణక్రియ సాఫీగా జరిగేందుకు దోహదం చేస్తుంది. ఈ విటమిన్-సి యాంటాక్సిడెంట్స్గా కూడా పని చేస్తుంది. జామపండ్లు జలుబు, ఫ్లూ రాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.
- జామ పండులో పొటాషియం లెవల్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇది ఎలక్టోల్రైట్గా శరీరానికి కావాల్సిన సత్తువను అందిస్తుంది. జీర్ణక్రియ కూడా సాఫీగా జరిగేలా చేస్తుంది.
- కండరాల పనితీరులో పొటాషియం క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. యవ్వనాన్ని కాపడటంలో కూడా జామ మంచి గుణం కనబరుస్తుంది.
- కంటి ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. డైలీ డైట్లో జామపండు చేరిస్తే చర్మసౌందర్యం కూడా పెరుగుతుంది