Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంట్లోని వస్తువుల్ని శుభ్రం చేయటానికి సబ్బులు లేదా క్లీనర్స్ వాడుతుంటాం. అయితే మనం తీసుకునే కొన్ని ఆహారపదార్థాలు న్యాచురల్ క్లీనర్స్గానూ పనిచేస్తాయి. టూ ఇన్ వన్‌గా ఉపయోగపడే ఆ న్యాచురల్ ఫుడ్ క్లీనర్స్ ఏంటో తెల్సుకుందాం.
- ఓట్స్ బలవర్థకమైన ఆహారం మాత్రమే కాదు.. మంచి క్లీనర్ కూడా. ఓట్స్ పిండికి కొన్ని నీళ్లు కలిపి చేతుల్ని శుభ్రపరచుకోవచ్చు. ఇలా చేస్తే చేతిపై ఉండే మురికితోపాటు సూక్ష్మజీవులూ అంతమవుతాయి.
- సాస్‌కు గోరువెచ్చటి నీళ్లు కలిపి రాగిపాత్రల్ని శుభ్రపరచవచ్చు. ఇలా చేస్తే రాగి పాత్రలు మెరుస్తాయి.
- వంటసోడా ఆహారంలో వాడటానికే కాదు మంచి క్లీనర్‌గా ఉపయోగపడుతుంది. దీనికి కాస్త నిమ్మరసం జత చేసి సింక్‌ను క్లీన్ చేసుకోవచ్చు. టైల్స్‌ను కూడా క్లీన్ చేయొచ్చు.
- శుభ్రం చేయవల్సిన గాజు పాత్రల్లో ఒకకప్పు బియ్యం వేయాలి. అందులో వేడి నీళ్లు పోసి షేక్ చేస్తే మంచి గుణం కనిపిసిస్తుంది. ఈ నీటితో మిగతా పాత్రల్నీ, గ్లాస్ బాటిల్స్‌ను క్లీన్ చేసుకోవచ్చు.
- బ్లాక్‌టీ చల్లారాక దాంతో పాత్రలను క్లీన్ చేయొచ్చు. దీంతో పాటు వుడెన్ ఫ్లోర్‌ను శుభ్రం చేసుకోవచ్చు.