Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవకాశం ఉన్నవారు చెట్టునుంచి సేకరించిన తాజా గోరింటాకును రుబ్బి వాడటం మంచిది.లేదంటే మార్కెట్లో లభించే మంచి నాణ్యమైన గోరింటాకును ఎంపిక చేసుకోవాలి. చౌకబారు బ్రాండ్ల మాయలో పడితే చర్మ సమస్యలు తప్పవని గుర్తించాలి.
- సహజంగా ఎండిన గోరింటాకు లేత ఎరుపు లేక ఎరుపు కలిసిన ఖాకీ రంగులో ఉంటుంది.
- అయితే తాజాగా కనిపించేందుకు కొందరు వ్యాపారులు ఆకుపచ్చ రంగు కలుపుతారు గనుక ఆకుపచ్చ రంగు హెన్నా పొడిని వాడొద్దు.
- హెన్నా కొనేటప్పుడు కాస్త హెన్నా పొడిని అరచేతిలోకి తీసుకుని వేలితో దానిపై రుద్దితే ఎంత వేడి పుడితే అంత నాణ్యమైనదని అర్థం.
- హెన్నా మిశ్రమానికి ఆవనూనె కలిపి గిన్నెలో పెట్టి దానిపై పొడి గుడ్డ కప్పి 10 గంటల పాటు పొడి వాతావరణంలో ఉంచి వాడితే బాగా పండుతుంది.
- చేతులు, కాళ్ళపై అవాంచిత రోమాలున్న వారు వాక్సింగ్ చేయించుకొని, ఆ తర్వాత గోరింటాకు పెట్టుకుంటే మంచిది. హెన్నా పెట్టుకున్న తర్వాత వాక్సింగ్ చేయిస్తే రంగు పోతుందని మరువొద్దు.
- గోరింటాకు పండిన తర్వాత నేరుగా నీళ్ళు పోసి కడగ కూడదు. ఎండిన హెన్నాను చెంచా లేదా చాకుతో నెమ్మదిగా తొలగించి అరచేతులపై కొంచెం సున్నం (తాంబులంలో వాడేది) వేసి రెండు అరచేతులూ బాగా రుద్ది నీటితో కడగాలి. ఎలర్జీలు బాధితులు సున్నా నికి బదులు కొబ్బరి నూనెతో రుద్దుకొని నీళ్ళతో కడిగితే రంగు ఎక్కువ కాలం నిలుస్తుంది.
- గోరింటాకు మిశ్రమానికి పుదీనా గుజ్జు లేక పుదీనా నూనె కలిపితే మరింత పండుతుంది.
- హెన్నా పొడికి నిమ్మరసం కలిపి పెట్టుకుంటే పండిన రంగు ఎక్కువ కాలం నిలుస్తుంది.
- గోరింటాకు పెట్టుకున్న తర్వాత వీలైనంత ఎక్కువ సమయం ఉంచుకుంటే సహజంగా ఎండి బాగా పండుతుంది.