Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హాస్టల్లో చొరబడి అమ్మాయిలను కత్తితో బెదిరించి దాడిచేయడానికి ప్రయత్నించిన సంఘటన వార్తల్లో వచ్చింది. ఆయుధంతో బెదిరించి దాడికి పాల్పడినప్పుడు ఏ విధంగా తప్పించుకోవచ్చో ఈరోజు తెలుసుకుందాం.
స్టెప్ 1
కుడిచేత్తో కత్తి పట్టుకుని అమ్మాయిపైకి దాడి చేయడానికి ప్రయత్నించాడు అగంతకుడు. వెంటనే అమ్మాయి కొంచెం వెనక్కి జరిగి రెండుచేతులతో ఎక్స్ బ్లాక్ చేసింది.
స్టెప్ 2
కుడిచేతితో మణికట్టుని పట్టుకుని కుడివైపు తిప్పితే ఆ వ్యక్తి బాధ భరించలేక కత్తిని వదిలేస్తాడు.
స్టెప్ 3
వెంటనే ఆ వ్యక్తి వీపుపై ఎల్బోతో బలంగా కొట్టి అక్కడి నుంచి తప్పించుకోవాలి.
చుట్టూ ఉన్నవారిని అప్రమత్తం చేసి పోలీసులకు పట్టించాలి.
- సుప్రియ జాడి
జెన్షిటోరియా కరాటే
సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనర్
ఫోన్. 9849237307