Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అరటి పండ్లలో అత్యధిక పోషక విలు వలు, పీచు పదార్థం ఉంటుంది. అరటి పండులోని పీచు జీర్ణ ప్రక్రియను మెరుగుపరచడమే కాకుండా, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది లోవర్ బ్లడ్ కొలెస్ట్రాల్ , గ్లూకోజ్ స్థాయిలను కాపాడుతుంది.
- అరటిపండులో అధిక శాతంలో పొటాషియం నిల్వలున్నాయి. ఇది సాధారణ రక్తపోటును అదుపులో ఉంచేందుకు దోహాదపడుతుంది.
- భోజనం అనంతరం చాలా మంది అరటి పండును తింటారు. అలాగే అరటి పండులో చెక్కర నిల్వలు 17 నుంచి 19 శాతం వరకు ఉన్న కారణంగా వీటిని తీపి పదార్థాల తయారీలో వినియోగిస్తుంటారు.
- అరటిపండును భారతదేశంలో ''పంచామతాల''లో ఒకటి గా భావిస్తారు. అలాగే దీనితో చిప్స్, చాక్లెట్లు, జామ్, జెల్లీలను రూపొందిస్తారు.
- రోజూ ఒక అరటి పండు ను తింటే బరువు తగ్గుతారు. బరువు పెరిగేందుకు కూడా అరటిపండు దోహాద పడుతుంది. ప్రతి రోజు రెండు అరటి పండ్లను తినడం వలన శరీర బరువు పెరుగుతుంది.
- అరటిపండు అలసట, నిస్సత్తువను దూరం చేసేందుకు ఉపక రిస్తుంది. 100 గ్రాముల బరువుండే అరటిపండులో 117 కేలరీలు, 1.2 గ్రాముల ప్రోటీన్లు, 0.3 శాతం కొవ్వు పదార్థం ఉంటుంది.