Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బొమ్మలు కావాలి అని పిల్లలు అడగ్గానే తల్లిదండ్రులు ఏదీ ఆలోచించకుండా కొనేస్తుంటారు. ఇలా ఏదోఒకటి కొనేయడంలో అర్థం లేదు. ఎంత చిన్నది కొంటున్నా...ఖరీదైనది ఎంచుకుంటున్నా అది వాళ్లకు ఉపయోగపడేలా చూసుకోవాలి.
- ఆసక్తి కలిగించని, ఏ విశేషం లేని బొమ్మల్ని పిల్లలు ఒకటి రెండు రోజులు ఆడుకుని తరువాత పక్కన పడేస్తుంటారు. అందుకే వీలైనంత వరకూ ఉపయోగపడే బొమ్మలకే ప్రాధాన్యం ఇవ్వాలి.
- పిల్లలు ఆడుకుంటూనే సమస్యల్ని పరిష్కరించడం, ఏకాగ్రతా, కదలకుండా ఒకచోట కూర్చోవడం వంటి వాటిని నేర్చుకుంటారు. అలాంటి నైపుణ్యాలు వాళ్లకు రావాలంటే పజిళ్లూ, గళ్లు పూరించడం, క్లేతో ఆకృతులు చేయడం, రంగులు వేయడం వంటి వాటికి సమయం కేటాయించేలా చూడాలి.
- కాస్త వయసు పెరిగేకొద్దీ చిన్నారులు తమను తాము పెద్దవాళ్లలా ఊహించుకోవడం మొదలు పెడతారు. దాంతో ఇంట్లోని రిమోట్, పెద్దవాళ్ల సెల్ఫోను లాంటి వాటితో ఆడుకోవడానికి ఇష్టపడతారు. అలాంటి వాటిని చూసినపుడు వెంటనే వాళ్ల చేతుల్లోంచి ఆ వస్తువుల్ని లాక్కోకండి. వాటిని బొమ్మల రూపంలో కొనివ్వండి. బొమ్మ ఫోనూ, సెల్ఫోనూ సంగీత వాద్యాల వంటివి వారికి అందివ్వాలి. త్వరగా రాయడం, చదవడం లాంటివి అలవాటు కావాలంటే.. పెద్ద పెద్ద బొమ్మలున్న పుస్తకాలూ, అక్షరాల మౌల్డులూ, ఫింగర్ పెయింట్ల వంటివి వారికివ్వాలి.
- పిల్లల్ని శారీరకంగా చురుగ్గా ఉండేందుకు ఉంచేందుకు బంతులు, క్రికెట్ బ్యాట్లూ, సైకిల్ వంటివి కొనివ్వాలి. వాటితో ఇష్టంగా ఆడు కుం టారు. పనిలో పనిగా వాళ్లకు వ్యాయామమూ అందుతుంది.
- పిల్లలు అడిగినంత మాత్రాన ప్రతి బొమ్మా కొనివ్వకూడదు. ఏదిబడితే అది కొనిస్తే అవి పిల్లల ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించే అవకాశముంది. వాటిల్లో వాడే కొన్ని రకాల రసాయనాలు పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి.