Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిమ్మరసంతో శరీరానికి ఎంత ఆరోగ్యమో అందరికీ తెలిసిందే... నిమ్మరసం పిండేశాక మిగిలిన తొక్కని కూడా చాలా రకాలు ఉపయోగించుకోవచ్చు.
- షూ వాసన పోవాలంటే... రాత్రి షూ విప్పేశాక నిమ్మచెక్కని లోపల పెట్టి వదిలేయండి. ఉదయం కల్లా దుర్వాసన దూరమైపోతుంది.
- చేతులకు పట్టిన మురికిని వదిలించడానికి పిండేసిన నిమ్మచెక్కని వాడుకోవచ్చు. బీట్ రూట్, అరటికాయ, వంకాయ కోసేప్పుడు చేతుల రంగు మారుతాయి. అలాంటప్పుడు నిమ్మచెక్కతో చేతులు కడుక్కోవాలి.
- సింకుపై మరకలు అసహ్యంగా కనిపిస్తే నిమ్మచెక్కతో రుద్దేస్తే ఐదు నిమిషాల్లో మెరిసిపోతుంది.
- తువ్వాళ్లు, దుప్పట్లు ఉతికేప్పుడు నీళ్లలో నిమ్మతొక్కలు, వంటసోడా కలిపి వేసి బాగా నానబెట్టి ఉతికితే తెల్లగా వస్తాయి. మరకలున్న చోట నిమ్మచెక్కతో రుద్ది ఉతకచ్చు.
- వెనిగర్ లో నిమ్మతొక్కని ముంచి దాంతో కిటికీ అద్దాలు, కార్ల అద్దాలు తుడిస్తే మరకలు ఇట్టే పోతాయి.
- ఫ్రిజ్ లో వివిధ రకాల పదార్థాలు పెట్టడం వల్ల అదోరకం వాసన వస్తుంది. నాలుగు నిమ్మచెక్కని ఫ్రిజ్ ల వివిధ మూలల్లో పెడితే ఆ వాసనను పీల్చేస్తాయి.
- చేతి గోళ్లు మురికిపోయి మెరుపు రావాలంటే నిమ్మచెక్కతో రుద్దాలి.
- మోచేతి కింద నల్లగా ఉంటుంది చాలా మందికి... అలాంటి వారు రోజూ నిమ్మచెక్కతో రుద్దితే మంచి ఫలితం ఉంటుంది.
- ఇంట్లో చీమలు పట్టే చోట నిమ్మ చెక్కల్ని పెడితే... చీమలు దరిచేరవు. నిమ్మ వాసన వాటికి అస్సలు ఇష్టం ఉండదు.