Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుక్కలను, పిల్లుల్ని పెంచుకోవడం ఈరోజుల్లో చాలామందికి హాబీగా మారిపోయింది. అయితే వాటిని ఇంట్లో పెంచుకోవాలనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ముఖ్యంగా చిన్న పిల్లలు ఇంట్లో వున్నట్లయితే...అందుకని ఈ జాగ్రత్తల గురించి తెలుసుకోండి..
- పెంపుడు జంతువుల వద్ద క్రిములు ఎక్కువగా చేరుతుంటాయి కాబట్టి ఇంట్లో అప్పుడే పుట్టిన పిల్లలు, చిన్న పిల్లలకు కాస్త దూరంగా ఉంచడం మంచిది. ఎందుకంటే వాటి నుండి క్రిములు చిన్నపిల్లలకు చేరే అవకాశం లేకపోలేదు.
- మీ పిల్లలకు అలర్జీ, చర్మ సమస్యలు ఉంటే వారి దగ్గరకు వెళ్లనివ్వకండి. పిల్లలకు పెంపుడు జంతువుల పట్ల భయం ఉంటే వారిని దగ్గరకు రా, వీటితో ఆడుకో అంటూ బలవంతం చేయకూడదు. వారికీ ఇష్టంగా ఉంటేనే వాటితో స్నేహం చేయించాలి.
- కొన్ని పెంపుడు జంతువులకు కొన్ని నెలలకు లేదా సంవత్సరానికి ఒకసారి టీకాలు, వ్యాక్సిన్ వంటివి అవసరం కాబట్టి వాటి గురించి ముందే తెలుసుకోవాలి.
- గర్భంతో ఉన్నప్పుడు, పసిపిల్లలు ఒంటరిగా నిద్రిస్తున్న చోటు పెంపుడు జంతువులను ఉంచకూడదు. ఎందుకంటే సూక్ష్మక్రిములు వీటి నుంచి వారికి త్వరగా వ్యాపించి అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం లేకపోలేదు.
- పెట్స్ ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలపై అవి ఎక్కువ ప్రేమను చూపిస్తూ, వారితో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాయి. కానీ పిల్లలు భయంగా పెట్స్‌ను దూరం పెట్టినట్లయితే వాటి గోర్లతో పిల్లలపై దాడి చేస్తాయి. ఇవి కొన్నిసార్లు ప్రమాదానికి దారి తీయవచ్చు.
- రోజూ యాక్టివ్ గా ఉండే పెంపుడు జంతువులు ఉన్నట్లుండి కొన్నిసార్లు లేవకుండా ఒకేచోట నీరసంగా కూర్చుని ఉంటాయి. అనారోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేస్తుంటాయి. అందుకని ఇది అర్థం చేసుకుని వెంటనే పెంపుడు జంతువుల స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లాలి.