Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్షాకాలంలో ఈగలు, దోమలతోనే కాదు... తినే ఆహారం విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే రోగాలబారిన పడక తప్పదు.
- ఈ కాలంలో ఫిల్టర్ చేసిన నీళ్లు మాత్రమే తాగాలి. కూరగాయలు, పండ్లు, ఆకుకూరల్ని బాగా కడిగిన తర్వాత వండాలి.
- కేన్డ్ ఫుడ్‌ని తినడం మంచిది కాదు. తాజా ఆహారపదార్థాలను తింటే మంచిది. గడువుదాటిన ప్యాక్ట్ ఫుడ్స్ తినొద్దు.
- వంటింట్లో ఈగలు, దోమలు, బొద్దింకలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. వండిన ఆహార పదార్థాలను పొడి ప్రదేశంలో పెట్టాలి.
- కూరగాయలను, మాంసాన్ని కట్ చేయడానికి వేరు వేరు నైఫ్లను ఉపయోగించాలి.
- ఆహారపదార్థాల మీద మూతలు పెట్టాలి.
- వంటకాలను సరైన ఉష్ణోగ్రతలో వండాలి. ముఖ్యంగా నాన్వెజిటేరియన్ ఫుడ్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
- చల్లటి ఆహారపదార్థాల్ని వేడి చేసుకునేటప్పుడు అవి బాగా వేడెక్కాయో లేదో గమనించుకోవాలి.
- మైక్రోవేవ్‌లో ఆహారపదార్థాలను వేడిచేసేట ప్పుడు దానికి ఉద్దేశించిన పాత్రలను మాత్రమే వాడాలి.
- వండిన ఆహారపదార్థాలను రెండుగంటలకు మించి బయట ఉంచకూడదు. తినగా మిగిలిన ఆహారపదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టాలి.
- ఆహారాన్ని వేడిగా తింటే తొందరగా జీర్ణమవుతుంది. వాష్‌రూమ్‌కు వెళ్లి వచ్చిన తర్వాత చేతులను, కాళ్లను శుభ్రంగా కడుక్కోవాలి.