Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనసుకు, శరీరానికి హాయినిచ్చే పరిమళాలను ఇష్టపడని వారుండరు. నాడీ వ్యవస్థను ఉత్తేజ పరచి ఎంతటి మానసిక ఒత్తిడినైనా దూరం చేయటం, ఎదుటివారి దష్టిని ఆకర్షించేందుకు, మనపట్ల ఒక సానుకూల భావన కలిగేందుకూ పరిమళాలు దోహదపడతాయి. అయితే వీటి వినియోగంలో తగు జాగ్రత్తలు పాటించకపోతే కొన్ని సమస్యలూ ఎదురు కావచ్చు.
- పరిమళాల తయారీ, సువాసనలను బట్టి వీటిని ఆయా పేర్లతో పిలు స్తారు. ఫ్లోరల్... అంటే పువ్వుల నుంచి చేసేవి. వీటిని స్త్రీలు ఎక్కువగా వాడతారు. ప్రూటీ. అంటే తాజా పండ్ల సువాసనలని చ్చేవి. మరో రకం.. ఓషనిక్. రసాయనాలతో చేసే ఈ రకం వాడితే సముద్రం, దాని చుట్టు పక్కల వాతావరణం గుర్తుకొస్తాయి. గ్రీన్ అనేది వాడితే ప్రకతిలో లీనమైన భావన కలిగి కొత్తశక్తి వచ్చినట్లవుతుంది. గాఢత ఎక్కువగా ఉండి అడవుల్లోని చెట్ల బెరళ్ల వాసనలను కలిగి ఉండేవి ఉడీ రకం. ఇలా మరెన్నో.
- అయితే పెర్ ఫ్యూమ్ వాడే ప్రతిసారీ బాటిల్‌ను షేక్ చేయాలి. అప్పుడే సమాన గాఢతతో వస్తుంది.
- పెర్ఫ్యూమ్ కొనేటప్పుడు తప్పనిసరిగా ప్యాచ్‌టెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల ఎలర్జీ ఉన్నా ముందే తెలుసుకోవచ్చు.
- నాణ్యమైన పెర్ఫ్యూమ్ చేతికి రాసుకున్న 15 నిమిషాల తర్వాతా మంచి వాసన వస్తుంది. లేకుంటే కల్తీ అని అర్ధం.
- వీటి వినియోగంతో అలర్జీ, చర్మ సమస్యలు, మైగ్రేన్ తలనొప్పి ఉంటే వాటికి దూరంగా ఉండటం మంచిది.
ఏసీజన్లో ఏవి..?
- వసంత రుతువులో ఫ్లోరల్ సెంట్లు వాడాలి.
- వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల పరిమళాల తీవ్రత ఎక్కువ గనుక తక్కువ గాఢత గల, చల్ల దనాన్నిచ్చే సిట్రస్ పరిమళాలు వాడాలి.
- ఆకురాలే కాలంలో ఫ్రూటీ, ఉడీ పరిమళాలు ఉల్లాసాన్నిస్తాయి.
- బద్ధకంగా ఉండే చలికాలంలో ఉత్సాహాన్నిచ్చే ఊడీ రకం నప్పుతుంది.