Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రీన్ టీ ఆకుల్ని పొడి చేసి దానిలో కొన్ని చుక్కల పాలు కలపాలి. ఈ పేస్టు ముఖానికి రాసుకొని అరగంట తరువాత కడుక్కోవాలి. ఇలా చేస్తే బ్లాక్ హెడ్స్ చాలా త్వరగా పోతాయి.
- కొన్ని వేపాకుల్ని తీసుకొని దానిలో కొద్దిగా పాలుపోసి పేస్టులా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని ఆరిన తరువాత కడుక్కోవాలి. ఇలా చేస్తే బ్లాక్‌హెడ్స్ తొలగిపోతాయి.
- కరివేపాకుల్ని పేస్టు చేసి దానికి కొద్దిగా పసుపు, కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని ఆరిన తరువాత కడుక్కోవాలి. ఈవిధంగా వారానికి ఒకసారి చేయాలి.
- కొత్తిమీర లేదా పుదీనా ఆకుల పేస్టుని ఫేస్ ప్యాక్‌లా వేసుకోవడం ద్వారా కూడా బ్లాక్ హెడ్స్‌ని నివారించవచ్చు.
- తులసి ఆకుల్ని పేస్టులా చేసుకోవాలి. దానిలో ఒక టేబుల్‌స్పూను పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసు కొని అరగంట తరువాత కడుక్కోవాలి. ఈ పద్ధతి ద్వారా బ్లాక్ హెడ్స్ పోవడమే కాకుండా చర్మం కూడా తెల్లగా మారుతుంది.