Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కృత్రిమ తయారీలకన్నా సహజసిద్ధమైనవి ఎప్పుడూ అద్భుతమైనవే. అలాంటి వాటిలో తేనె ఒక ప్రథమ స్థానాన్ని ఆక్రమిస్తుంది. పలురకాల రుగ్మతలకు విరుగుడుగా కొన్ని దశాబ్దాలుగా మానవాళిని కాపాడుతోంది. తేనెలో ఫ్రక్టోస్, గ్లూకోజ్ వంటి సహజ సిద్ధమైన షుగర్స్‌తో పాటు అతి ముఖ్యమైన విటమిన్లు, లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, సమృద్ధిగా ఉన్నాయి.
తేనెలో ఫ్లోరల్ ఫ్లేవోనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లను పెంచడంతో పాటు ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తాయి. అలాగే ఆక్సిడేటివ్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి.
- ఇందులోని హైడ్రోజన్ పెరాక్సైడ్ స్టెరిలైజర్గానూ, ఇన్ఫెక్షన్లను నిరోధించడంలోనూ బాగా ఉపయోగపడుతుంది.
- తేనెలోని తీయదనంతో లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మ్యూకస్‌ని పలుచపరచడంతోపాటు, దగ్గునూ తగ్గిస్తుంది.
- మార్కెట్లో దొరికే రిఫైన్డ్ షుగర్ కన్నా తేనె ఎంతో మెరుగైనది. ఇందులో కేలరీస్ చాలా తక్కువగా ఉంటాయి.
- తేనెలో బి-6, థైమిన్, నియాసిన్, రిబోఫ్లేవిన్, పాంటోథెనిక్ యాసిడ్, అమినో యాసిడ్స్, క్యాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, పాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి శరీర పోషణకు అవసరమైన పలు విటమిన్లు, లవణాలు పుష్కలంగా లభిస్తాయి.
- ఏదైనా పనిలోకి వెళ్లే ముందు నిమ్మరసంలో తేనె కలుపేసుకుని తాగితే, అదనపు శక్తి లభిస్తుంది. తేనెలో ఉండే ఫ్రక్టోస్ కండరాల బలహీనతను అరికడుతుంది.
- మధుమేహం ఉన్న వాళ్లు కూడా తేనె వాడవచ్చు కాకపోతే చాలా పరిమితంగానే తీసుకోవాలి.
- గుండె జబ్బుల్ని, కేన్సర్‌ను నివారించడంలో కూడా తేనె ఉపయోగపడుతుంది.
- తృణ ధాన్యాలకు తేనె కలుపుకుని తీసుకుంటే ప్రొటీన్స్తో పాటు విటమిన్లు, లవణాలు కూడా శరీరానికి అందుతాయి.
- ప్రతి రోజూ నిమ్మరసంతో కలిపి తీసుకుంటే చర్మ వ్యాధులనుంచి కూడా బయటపడపచ్చు.