Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం వెదురుతో
తీర్చిదిద్దిన ఫర్నిచర్ మార్కెట్లో విస్తతంగా లభిస్తోంది. వెదురుతో ఇండ్లు కూడా కట్టేస్తున్నారు. కాస్త సజనాత్మకత జోడిస్తే ఎక్కువ ఖర్చు లేకుండా వెదురుతో మీ ఇంట్లో ఒదిగిపోయే అందమైన అలంకరణ వస్తువులు మీరే తయారు చేసుకోవచ్చు.
కలర్ఫుల్గా: అన్ని రకాల వెదురు బొంగులు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. కాస్త బలమైన వాటిని తీసుకుని.. ఓ క్రమమైన సైజులో కట్ చేయండి. వాటికి అందమైన రంగులు వేసి, మెరిసిపోయే రిబ్బన్లు చుట్టేయండి. కలర్ఫుల్గా కనిపించే
ఆ బాంబూ పోల్స్‌ను హాల్లో గోడపై అమర్చి చూడండి.. మీ హాల్ అందం రెట్టింపు అవుతుంది.
సపోర్టివ్ డెకరేషన్: ఆర్టిఫి షియల్ సొబగులు ఎన్ని ఉన్నా.. నేచురల్ అందం ముందు అవి ఇట్టే తేలిపోతాయి. బాంబో పోల్స్‌తో ఎన్నో అద్భుతాలు చేయవచ్చు. హాల్లో, బాల్కనీలో నాలుగైదు బాంబో పోల్స్‌ను పిల్లర్స్‌లా అమర్చేయండి. మీ ఇంటికి ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది. బాంబూలో తీపి ఉండటం వల్ల చెదలు పడతాయి. వార్నెస్ బాగా అప్లరు చేసి.. చెదలు పట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటే వెదురుకు తిరుగే ఉండదు.
చిన్న చిన్న బాంబో ముక్కలను అలంకరణ వస్తువులుగా వాడేయొచ్చు. వెదురుతో పేపర్ వెయిట్స్, పెన్ స్టాండ్లు, ఫోటో ఫ్రేమ్స్, వాల్ హ్యాంగింగ్స్.. వంటివి మనమే తయారు చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం. వెదురుతో అదిరిపోయేలా డెకరేట్ చేసేయండి. మీ సజనాత్మకతను జోడించి బాంబూతో మీ ఇంటికి సరికొత్త అందాలను తెచ్చేయండి.