Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాల్కనీని అలంకరించేందుకు మొదటి స్టెప్ ఫ్లోరింగ్ అని చెప్పవచ్చు. సరైన ఫ్లోరింగ్ ఉపయోగించుట వలన బాల్కనీ అందం మరింత రెట్టింపవుతుంది. బాల్కనీ ఫ్లోరింగ్ తెలుపు లేదా లేత రంగు గులాబీ మొక్కలను ఉపయోగించటం వలన ఇల్లు మోడ్రన్‌గా కనిపిస్తుంది.
- బాల్కనీ అలంకరించేందుకు సరైెన మొక్కలను ఎంచుకోవలసిన అవసరం ఉంది. తాజాగా ఉండే బలమైన మొక్కలను, లావెండర్ మొక్కలు వేయుట వలన బాల్కనీ ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
- మొక్కలు మానసిక ఒత్తిడిని తగ్గించి, విశ్రాంతిని కలిగిస్తాయి. కాబట్టి మొక్కలను ఇంట్లో పెంచుకోవడం మంచిది. ఇప్పటికే బాల్కనీలో నాటిన మొక్కలు ఉంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. రాలిపోయిన ఆకులను ఎప్పటికప్పుడు తొలగించాలి.
- మొక్కలను డాబా అంచుల మీద పెంచటం వలన ఇల్లు, బాల్కనీ అందంగా కనిపిస్తుంది. అంతేకాదు డాబా మీద మొక్కలను పెంచడం వలన బాల్కనీ మరింత విశాలంగా కనిపిస్తుంది.
- బాల్కనీ ఖాళీగా, పెద్దగా ఉంటే అంచుల వెంబడి పూల కుండీలను పెట్టుకోవచ్చు. బాల్కనీ చిన్నగా ఉంటే తీగ మొక్కలను వేసుకోవడం మంచిది. తీగ మొక్కల వల్ల బాల్కనీ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.