Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందరూ కలిసి ఆనందంగా గడిపే ఈ పండుగ రోజుల్లో ఆరోగ్యకరమైన పిండివంటలను చిరుధాన్యాలతో చేసుకుంటే ఎంతో బాగుంటుంది. మరి ఈ పండుగ రోజున మీరు వీటిని ప్రయత్నించండి..
నువ్వులు, కొర్రల లడ్డు
కావల్సిన పదార్థాలు
నువ్వులు - పావు కిలో
కొర్రలు - వంద గ్రాములు
బెల్లం - పావు కిలో
నెయ్యి - కప్పు
ఇలాచి పొడి - కొద్దిగా
తయారుచేసే విధానం..
కొర్రలు కడిగి ఆరపెట్టాలి. ఆరిన తర్వాత వేయించి పొడి చేసుకోవాలి. నువ్వులు కూడా వేయించి పెట్టుaకవాలి. మిక్సీజార్‌లో కొర్రల పిండి, నువ్వులు, ఇలాచి బెల్లం వేసి రెండు గ్రాండ్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకుని వేడిచేసి నెయ్యి ఇందులో పోస్తూ కలపాలి. లడ్డుగా చుట్టుకుని నిల్వ ఉంచుకోవచ్చు. పిల్లలకు కావల్సిన పోషకాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి.
రాగి చెక్కలు
కావల్సిన పదార్థాలు
రాగి పిండి - ఒక గ్లాసు
బియ్యం పిండి - రెండు గ్లాసులు
మైదాపిండి - ఒక గ్లాసు
నువ్వులు - రెండు టేబుల్ స్పూన్లు
పెసరపప్పు - అర గ్లాసు(నానపెట్టుకోవాలి)
అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ - రెండు టేబుల్ స్పూన్లు
జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్
వెన్న - నాలుగు టేబుల్ స్పూన్లు
కరివేపాకు - ఒక కట్ట
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా
తయారుచేసే విధానం..
ఒక ప్లేటులో రాగిపిండి, బియ్యం పిండి, మైదా పిండి, నువ్వులు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి పేస్టు, వెన్న, ఉప్పు, పెసరపప్పు, కరివేపాకు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత తగినన్నీ నీళ్ళుపోసి పూరీ పిండిలా బాగా కలపాలి. ఈ పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసి పూరీల్లా వత్తి నూనెలో వేసి ఎరగ్రా కాల్పువలి. ఇవి చల్లారిన తర్వాత డబ్బాలో నిల్వ చేసుకుంటే నెలరోజుల వరకు ఉండాయి.
ఊదల పుల్గం
కావల్సిన పదార్థాలు
ఊదలు - కప్పు
పెసరపప్పు - అరకప్పు
వేయించిన నువ్వుల పొడి - నాలుగు టేబుల్ స్పూన్లు
ఉప్పు - తగినంత
నెయ్యి - నాలుగు టేబుల్ స్పూను
తయారుచేసే విధానం.. ఊదలు ఆరుగంటలు నానపెట్టాలి. అందులో పెసరపప్పు, నెయ్యి వేసి ఆరు కప్పుల నీళ్లు పోసి కుక్కర్లో నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.ప్రెషర్ పోయిన తరువాత మూత తీసి నెయ్యి, నువ్వుల పొడి వేసి తగినంత ఉప్పు వేసి ఒకసారి వేడిచేస్తే సరి.. ఘుమఘుమలాడే ఊదల పొంగలి రెడీ..
అరికెల పొంగలి
కావల్సిన పదార్థాలు
అరికెలు - ఒక కప్పు
పెసరపప్పు - ఒక కప్పు
బెల్లం - రెండు కప్పులు
నెయ్యి - అర కప్పు
డ్రైపూట్స్ - రెండు టేబుల్ స్పూన్లు
ఇలాచి పొడి - కొద్దిగా
తయారుచేసే విధానం..
అరికెలు కడిగి ఆరు గంటల పాటు నాననివ్వాలి.
ఆ తర్వాత అరికెలతో పాటు పెసరపప్పు వేసి, కొద్దిగా నెయ్యి వేసి కుక్కర్లో నాలుగు విజిల్స్ వచ్చేవరకు స్టవ్‌పై ఉంచాలి. నాలుగు విజిల్స్ వచ్చాక చల్లారనివ్వాలి. ఒక చిన్న గిన్నెలో బెల్లం వేసి కొద్దిగా నీళ్ళుపోసి
లేతపాకం వచ్చేవరకు ఉంచాలి. దీన్ని అరికెల మిశ్రమంలో వడకట్టాలి. ఆ తర్వాత బాగా కలపాలి.
మళ్ళీ కాసేపు స్టవ్‌పై ఉంచి కొద్దిగా ఉడకనివ్వాలి. ఇలాచీ పొడి, నెయ్యిలో వేయించిన డ్రైప్యూట్స్ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. వేడివేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
గుమ్మడికాయ తీపికూర
కావల్సిన పదార్థాలు
గుమ్మడికాయ - పావు కిలో(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
చిలగడదుంప - పావుకిలో
ఉల్లిపాయలు - చిన్నవి రెండు
పచ్చిమిర్చి - నాలుగైదు
నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు
చింతపండు రసం - అరకప్పు
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
బెల్లం - కొద్దిగా
నువ్వులపొడి - అరకప్పు
తాలింపు గింజలు - ఒక టీస్పూన్
తయారుచేసే విధానం..
స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలి. వేడి అయ్యాక తాలింపు గింజలు వేసి
అవి వేగిన తర్వాత కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, గుమ్మడికాయ ముక్కలు, చిలగడదుంప ముక్కలు వేసి కొద్దిగా నీళ్ళు పోసి కలపాలి. కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఆగాలి. చల్లారిన తర్వాత చింతపండురసం, బెల్లం, ఉప్పు వేసి కాసేపు ఉడికించాలి. నువ్వులపొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. కొత్తిమీర వేసి వడ్డిస్తే అన్నంలోకి, చపాతిలోకి ఎంతో బాగుంటుంది.
- పద్మ,
పిండివంటల స్పెషలిస్ట్