Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవలి కాలంలో కుర్చీకి అతుక్కుపోయి చేసే ఉద్యోగాలు ఎక్కవయ్యాయి. దీనితో వ్యాయామం లేకపోవడంతో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయి. అందుకని ఈ చిట్కాలు ఆచరిస్తే గుండె ఆరోగ్యానికి ఢోకా వుండదు. అవేమిటో చూద్దాం.
- నడక గుండెకు మంచిది. రోజూ అరగంటపాటు నడవడం అలవాటు చేసుకోండి.
- గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మెట్లు ఎక్కండి. పైకి ఎక్కితే మీ రక్తపోటు తగ్గుతుంది.
- కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.
- లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ షుగర్, బి.పి పరీక్షలను తరచుగా చెక్ చేయించుకోండి.
- బరువును నియంత్రణలో ఉంచుకోండి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోండి.
- ఏడాదికొకసారి కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోండి.
- డయాబెటిస్ ఉంటే కనుక నియంత్రణలో ఉంచుకోండి. వ్యాయామం చేయడం మరవకండి. షుగర్ ఉన్న మహిళలకు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ అని గుర్తుపెట్టుకోండి.
- రోజూ ఐదు రకాల పండ్లు, కూరగాయలు తినండి.
- డైనింగ్ టేబుల్‌పై ఉప్పు డబ్బా లేకుండా చూసుకోండి. తినే సమయంలో అదనంగా ఉప్పు వేసుకునే అలవాటుకు స్వస్తి చెప్పండి. రోజులో ఒకటిన్నర స్పూన్(2400ఎం.జి) ఉప్పు మాత్రమే తీసుకోండి.