Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాటర్ఫిల్టర్కి కొత్త క్యాండిల్ బిగించిన తర్వాత ఫిల్టర్ అయిన నీళ్ళు మట్టివాసన వస్తాయి. అందుచేత కొత్తక్యాండిల్ను బిగించబోయేముందు ఆ క్యాండిల్స్ నీళ్ళలో మునిగేటట్లుగా ఒకటి రెండు రోజులు నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాతనే ఉపయోగించాలి.
- వారానికి రెండుమూడుసార్లు వాటర్‌ఫిల్టర్ క్యాండిల్స్‌ను శుభ్రం చేయాలి. లేకపోతే క్యాండిల్స్ మురికావడంతో పాటు క్యాండిల్స్ అమర్చిన డబ్బాలో అడుగున మట్టిచారలు పేరుకుని ఫిల్టర్ మురికి అవుతుంది.
- క్యాండిల్స్ బాగా నల్లగా అయి అవి మురికిపట్టి వున్నప్పుడు సబ్బుపొడి కలిపిన వేడినీళ్ళలో వాటిని నానబెట్టి ఆ తర్వాత మెత్తని పీచుతో తోమితే క్యాండిల్స్ శుభ్రపడతాయి.
- క్యాండిల్స్‌ను శుభ్రపరచటానికి ప్రత్యేకమైన బ్రష్‌ను ఉపయోగించడం మంచిది.