Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కంటి ఆరోగ్యం కోరేవారంతా ఏడాదిపొడవునా లభించే పుల్లని పండ్లు తీసుకోవాలి. వీటిలో విరివిగా ఉండే విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు కళ్లలోని కార్నియా పనితీరును పెంచుతాయి. దీనివల్ల త్వరగా కాటరాక్టు అవసరం రాదు.
- క్యారట్లలో విరివిగా లభించే బీటా కెరోటిన్, విటమిన్-ఎ రెటీనాను కాపాడుతాయి. ముఖ్యంగా ఉడికిన క్యారట్లు వారంలో ఎన్నిసార్లు తింటే కళ్లకు అంత మంచిది.
కంటి ఆరోగ్యం కోరేవారంతా చేపలను తినాలి. ముఖ్యంగా ట్యూనా వంటి చేపల్లో విరివిగా లభించే ఒమేగా-3 ఫాటీ ఆమ్లం కంటిజబ్బులను దూరం చేయటమే గాక రెటీనా పనితీరును పెంచుతుంది.
- రాత్రివేళ మెరుగైన కంటిచూపు కోరేవారంతా తప్పక బ్లూబెర్రీస్ తినాల్సిందే. వీటిలో పుష్కలంగా లభించే యాంథోసైనిన్స్, విటమిన్-సి కంటిచూపును మెరుగుపరచడమే కాకుండా కళ్ల అలసటను పోగొట్టి ఉపశమనాన్నిస్తాయి.
- పాలకూరలో ఎక్కువ మొత్తంలో ఉండే బీటా కెరోటిన్, విటమిన్స్ కళ్లపై అతినీలలోహిత కిరణాల ప్రభావాన్ని నిరోధిస్తాయి. దీనివల్ల చురుకైన కంటిచూపు లభిస్తుంది. అందుకే రోజూ ఎంతోకొంత పాలకూరను సలాడ్స్, కూర, పప్పు రూపంలో తినటం మంచిది.
- గుడ్డులోని విటమిన్-ఎ మొదలు పలు ఇతర కీలక పోషకాలు వయసుతోపాటు వచ్చే మాక్యులర్ డీజనరేషన్ వంటి రెటీనా వ్యాధులు రాకుండా కాపాతాయి.
బ్రకోలిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సి రెటీనా పనితీరును రెట్టింపు చేస్తాయి. అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణా లభిస్తుంది.
- మొక్కజొన్నలోని ల్యుటిన్ వంటి పదార్థాలు కంటి ఆరోగ్యాన్ని కాపాడి మాక్యులర్ డీజనరేషన్ వంటి రెటీనా వ్యాధులను నిరోధిస్తాయి. మొక్కజొన్నను ఎదో రూపంలో రోజుకు 5 - 8 గ్రాములు తింటే చిన్న వయసులో శుక్లాల సమస్య రాదు.