Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్త్రీలు జుట్టుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నిగనిగలాడే వారి శిరోజాలే వారికి అందం అని భావిస్తుంటారు. అటువంటి శిరోజాలకోసం తలస్నానానికి ముందు తర్వాత ఈ చిట్కాలు పాటించండి.. మీ జుట్టును నిగనిగలాడేలా చేసుకోండి.
గోరువెచ్చని కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్‌ను మాడుకు, కుదుళ్ళకు పట్టించి మర్దన చేయాలి.
- టర్కీటవల్‌ను వెచ్చని నీటిలో ముంచి, పిండి, తలకు చుట్టండి. ఈ విధంగా నెలకు ఒకసారైనా జుట్టుకు ఆవిరిపట్టాలి.
- శీకాయ లేదా షాంపూతో తలస్నానం చేసిన తర్వాత తడిజుట్టుకు కండిషనర్‌ని రాయండి. అయితే మాడుకు కండిషనర్‌ని తగలనివ్వద్దు.
జుట్టు తడిలేకుండా త్వరగా ఆరాలని డ్రయర్‌ని ఉపయోగించవద్దు. తలకు టవల్ చుట్టి కాసేపు వదిలేయాలి. జుట్టు తడిని టవల్ పీల్చుకుని, పొడిగా అవుతుంది.
- పార్టీలకో, బయటకు వెళ్ళినప్పుడో జుట్టు మెరవాలని హెయిర్ స్ప్రేలు వాడకూడదు. వీటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది.
- ప్రయాణాలలో కిటికీ దగ్గర కూర్చుంటే తలకు స్కార్ఫ్ కట్టుకోవాలి. గాలికి జుట్టు పొడిబారకుండా ఉంటుంది. దుమ్ముకూడా అంటదు. ఈ జాగ్రత్తలు పాటిస్తే శిరోజాలు ఆరోగ్యంగా నిగనిగలాడుతూ ఉంటాయి.