Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విటమిన్ల గురించి పూర్తి సమాచారం తెలుసుకుంటే మనం తీసుకునే ఆహారంలో వాటినెలా తినాలో ప్లాన్ చేసుకోవచ్చు. వివిధ వ్యాధుల్లో ఉపయోగపడే రకరకాల విటమిన్ల సమాచారం మీకోసం...
విటమిన్ ఎ, బి2 వంటివి కంటి వ్యాధులు రాకుండా నివారిస్తుంది.
ఊపిరితిత్తులను సంరక్షించేందుకు ఉపయోగపడే విటమిన్లు ఎ, ఇ
పళ్ల, చిగుళ్లకు సంబంధించిన వ్యాధుల్ని ఎదుర్కొనేందుకు ఉపయోగపడేవి విటమిన్ సి, డి, ఎ విటమిన్. జీర్ణశక్తికి ఉపయోగపడేవి విటమిన్ బి3, బి6
ఎముకల వ్యాధులు వచ్చినప్పుడు గానీ, రాకుండా నివారించేందుకు గానీ, ఏ వ్యాధి వచ్చినా తప్పనిసరిగా వాడవలసినవి నియాసిన్, విటమిన్ బి6.
రక్తవద్ధికి తోడ్పడే విటమిన్లు ఫోలిక్ యాసిడ్ విటమిన్ బి3, విటమిన్ బి6, బి12, ఇ, కె.
రక్తస్రావానికి తోడ్పడేది విటమిన్ కె. కండరాలను బలసంపన్నం చేసేందు కు తోడ్పడే విటమిన్లు బి, బి1, బి6, ఇ.
పిల్లల పెరుగుదలకు తోడ్పడే విటమిన్లు ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, బి 12. ఆయా వ్యాధులకు మందులు వాడుతున్నప్పుడు ఈ విటమిన్లు కల్గిన మందులు మీరు సరిగ్గా తెలుసుకుని వాడుకోవచ్చు.
మెదడు, నాడీవ్యవస్థకు సంబంధించిన శక్తిని కలిగించేందుకు ఉపయోగపడేవి, నరాల జబ్బుల్లో నివారణకు తోడ్పడేవి ఫోలిక్ యాసిడ్, పాంటో థెనిక్ యాసిడ్ బి3, పైరిడాక్సిన్ బి6, విటమిన్ సి.
గుండెపైన పనిచేసే వాటిలో ముఖ్యమైనవి విటమిన్ బి1, విటమిన్ ఇ.