Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందరూ ఎదుర్కొనే సమస్య పులిపిర్లు. ఇవి ఏర్పడటానికి ప్రధాన కారణం వైరస్. కొందరు వీటిని గిల్లడం, లాగడంవంటివి చేస్తుంటారు. దానివల్ల కొత్తచోట్లలో కూడా పులిపిర్లు ఏర్పడతాయి. ఇవి చర్మం రంగులో కాని, కాస్తంత ముదురు గోధుమ రంగులోకానీ బొడిపెల మాదిరిగా గరుకుగా ఉంటాయి. ప్రత్యేకించి నొప్పిని కలిగించవు. ఎక్కువగా ముఖం, మెడ, చేతులు, కాళ్లు మొదలైన ప్రదేశాల్లో వస్తుంటాయి.
బంగాళ దుంపను మధ్యకు కోసి ఆ ముక్కలతో రుద్దుతూ ఉండాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తుంటే పదిహేను రోజుల్లో పులిపిర్లు ఎండిపోయి రాలిపోతాయి.
పులిపిర్లుకు ఔషధంగా ఆముదం చక్కగా పనిచేస్తుంది. ఒక చుక్క ఆముదాన్ని పులిపిరి పైన వేసి స్టికింగ్ టేప్ అతికించాలి. ఇలా రెండు పూటలా మూడువారాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
పులిపిర్ల నివారణకు వెల్లుల్లిపాయలను ఒలిచి పులిపిర్లపై రుద్దుతూ ఉండాలి. ఉల్లిపాయను సగానికి కోసి మధ్యభాగాన్ని తొలగించి అందులో ఉప్పు నింపాలి. దీని నుంచి వచ్చే రసంతో పులిపిర్ల పైన సున్నితంగా రుద్దాలి. ఇలా దాదాపు నెలరోజుల పాటు చేస్తుండాలి.
అరటి పండు తొక్కను తీసుకుని గుజ్జు భాగం పులిపిరుల పైన ఆనేట్లుగా ఉంచి స్టికింగ్ ప్లాస్టర్తో అతికించాలి. రాత్రంతా ఉంచి ఉదయాన్నే తీసేయాలి. ఇలా కనీసం వారం రోజుల పాటు చేయాలి. ప