Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లవంగాలను మసాలా దినుసుగా మాత్రమే కాకుండా చాలా రకాలుగా ఉపయోగిస్తాం. దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక లవంగాన్ని నోట్లో వేసుకుంటాం. కానీ లవంగాలలో అనేక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం!
దగ్గుకు సహజమైన మందు లవంగం. దగ్గుకే కాదు, శ్వాస సంబంధిత సమస్యలకు కూడా అది బాగా పనిచేస్తుంది.
లవంగాలను పొడి చేసి నీళ్లలో తడిపి ఆ ముద్ద వాసన పీల్చిస్తే సైనస్ నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుంది.
రోజూ తాగే టీలో లవంగం వేసుకొని తాగితే కడుపుబ్బరం తగ్గుతుంది.
లవంగాలు పంటి నొప్పిని కూడా తగ్గిస్తాయి. అందుకే టూత్ పేస్టులలో ఎక్కువగా లవంగాలను వాడుతారు.లంగాలు ఏ వంటకంలోనైనా వేసుకోవచ్చు. ఇది వంటకాలకు మంచి సువాసనను, రుచినీ కూడా ఇస్తుంది.
అంతే కాదు వాతావరణం మారినప్పుడల్లా వచ్చే మామూలు రుగ్మతలకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఆహారంలో లవంగాన్ని వాడటం వలన ఒత్తిడి, అలసట, ఆయాసం నుండి ఉపశమనం లభిస్తుంది. ప