Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంట్లోని గాజు పాత్రలు, సీసాలు వృథాగా ఉంటున్నాయా..? వాటితో ఎలాంటి ఉపయోగం లేదని అనుకుంటున్నారా? అయితే వాటిని బయటకు తియ్యండి. వాటితో మీ ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేయవచ్చు. మనం మామూలుగయితే మొక్కలను మట్టి కుండల్లో పెంచుతాం. కానీ ఈ గాజుపాత్రలలో మొక్కలను పెంచడం వల్ల మన ఇంటిి అందం రెట్టింపవుతుంది. అయితే ఈ గాజు పాత్రల్లోకి చిన్న ఇటుక ముక్కలు, బొగ్గు పొడి, మట్టిని తీసుకోవాలి. వీటిని ఒకదాని తర్వాత ఒకటిగా పొరల్లాగా వెయ్యాలి. తర్వాత మనం ఎంచుకున్న మొక్కలను పెట్టుకోవాలి. అదనపు ఆకర్షణ కోసం ఈ పాత్రల్లో రంగుల గులక రాళ్ళు, గవ్వల్లాంటివి అలంకరించుకోవచ్చు.