Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాత్రంతా మంచిగా నిద్రపోయినా పొద్దున్నే నిద్రలేవడం కష్టమైన పనే. బద్ధకం వస్తుంది. అలా బద్ధకంతో లేచి హడావిడిగా పనులు మొదలుపెడితే రోజంతా చిరాగ్గానే గడుస్తుంది. ఉదయం ఆహ్లాదంగా, రోజంతా సంతోషంగా గడవాలంటే ఏం చేయాలో చెప్తున్నారు మానసిక నిపుణులు. నిద్ర లేవగానే, మంచం మీదనే, కాలు కూడా కింద పెట్టకుండా శరీరం అంతా లాగి స్ట్రెచ్ చేయాలి. దానివలన మన ఆలోచనలు, భావావేశాలు ప్రభావితం అవుతాయట. ఉదాహరణకు, వంగకుండా నిట్ట నిలువుగా కూర్చోవడం, నిటారుగా, ముక్కుసూటిగా నడవడం మన ఆత్మవిశ్వాసాన్ని ఎలా ఇనుమడిస్తాయో ఇది కూడా అంతే. ఒళ్లంతా విరుచుకుని శరీరం అంతా లాగిపెట్టి వదిలాలి. తనకి తాను పెద్దగా, శక్తివంతంగా, ఆత్మవిశ్వాసంగా భావించాలి. అదే భావన రోజంతా ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. అలానే కుడికాలు ముందుగా కింద పెట్టి మంచం మీద నుంచి లేవాలి. ఆ ఒక్కరోజే కాదు, ఎప్పుడూ ఆనందంగా ఉండటానికి దోహదపడుతుందట. చేసి చూడండి..