Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మామిడి కొమ్మమీద
కొలువైంది కోయిలమ్మా.
కిసలయముల రుచినే గ్రోలే
ఈ పాటలమ్మా
ఉగాదికే స్వాగతమంటూ
హుషారుగా రాగం తీసీ
మధురమైన తన గాత్రంతో
ఆహ్లాదపు జల్లులు కురిసీ
జగములోని జనులందరికీ
తరగని ఆనందం పంచే
వనమంతా పూవూ పూవూ
వాసంతపు విలాసమైంది
చిత్రమైన ప్రకతి కాంత
హరితవర్ణ వికాసమైంది
చిరుగాలి విరితావిని పంచీ
నేస్తమల్లె అలరించింది.
ఆరు రుచుల అంతరార్థమే
జీవిత పరమార్థం నేస్తం
నీ కషినే నమ్ముకుంటే
సహకరించు నీ గ్రహచారం
సాధనతో సఫలీకతమౌ
ఉన్నతమగు నీ ఆశయము