Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరోగ్యానికి నిద్ర ఎంత అవసరమో చెప్పనవసరం లేదు. ఈ విషయం తెలిసినా మన నిర్లక్ష్యంతో కంటినిండా కునుకు కరవై దీర్ఘకాలికరోగాలబారిన పడుతున్నాం. స్మార్ట్ఫోన్లు చేతికి వచ్చిన తర్వాత కునుకమ్మను మర్చిపోతున్నాం. పిల్లలు ఎంత నిద్రపోతే అంత మంచిది. కాగా యుక్తవయసు నుంచి రోజూ 8 నుండి 10 గంటల నిద్ర కచ్చితంగా ఉండాలి. అదే కావలసిన శక్తినిస్తుంది. మెదడు అభివద్ధి చెందుతుంది. అయితే ఇది నేటి జీవనవిధానంలో కుదరదనే వారే ఎక్కువ. కానీ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే సాధ్యమేనంటున్నారు నిపుణులు. మరి అవేంటో చూడండి....
* మనం తీసుకునే ఆహారపానీయాల ప్రభావం నిద్రమీద పరోక్షంగా ఉంటుందని గమనించాలి. నిద్రపోవడానికి కనీసం రెండు గంటల ముందు నుంచి కాఫీ, టీలు తాగకూడదు. వీటిలోని కెఫిన్ నిద్ర పట్టకుండా చేస్తుంది.
* వాకింగ్, యోగా వంటి వ్యాయామాలు క్రమం తప్పకూడదు.
* మెడిటేషన్ చేయడం వల్ల అనవసర ఆలోచనలు దూరమై ప్రశాంతతకు దోహదం చేస్తుంది.
* ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రకు ఉపక్రమించడం అలవర్చుకోవాలి. నిద్రపోవడానికి గంట ముందే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ ఆపెయ్యడం మంచిది.
* ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్ వంటి గ్యాడ్జెట్స్ నుంచి వచ్చే కాంతి కిరణాలు నిద్రకు దోహదం చేసే రసాయనాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి.
* పడకగదిలో వీలైనంత తక్కువ వెలుతురు ఉండేలా లైటింగ్ వ్యవస్థ ఉండాలి.
* పగటి పూట నిద్రతో రాత్రి నిద్రకు ఆటంకం కలుగవచ్చు.