Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేసవి కాలంలో నేత్రాలపై దష్టి సారించాలి. కండ్లు ఈ ఎండల్లో అధిక వేడి, వెలుతురుతో ఇట్టే అలసిపోతాయి. పైగా కండ్ల మంటలు మొదల వుతాయి. కంటి ఆరోగ్యం పది కాలాలు పదిలంగా ఉండాలంటే కనీస జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.
- చదువుతున్నప్పుడు సరిపడా వెలుతురు ఉండడంతో పాటు పుస్తకం కంటికి 30 సెంటీమీటర్ల దూరంలో 45 డిగ్రీల కోణంలో ఉండాలి.
- ఊయలలో కూర్చుని, సోఫాల్లో పడుకుని పుస్తకాలు చదవడం వల్ల కండ్లపై భారం ఎక్కువ పడుతుంది. అందుకని నిటారుగా కూర్చొని మాత్రమే చదవడం మంచిది.
-కంప్యూటర్ మానిటర్, ల్యాప్‌టాప్ పైన పనిచేస్తున్నప్పుడు కూడా కుర్చీలో నిటారుగా కూర్చోవాలి. అలా కూర్చున్నప్పుడు కాళ్లు నేలపై ఆనించి ఉండాలి. స్క్రీన్ మనకు సమాంతరంగా, సరియైన ఎత్తులో ఉండేలా జాగ్రత్త పడాలి. పరిసరాల వెలుతురు, మానిటర్ బ్రైట్ నెస్ విషయంలో తగు జాగ్రత్త అవసరం. కండ్ల రెప్పలు తరచుగా కొట్టడం, నిరంతరం పనిచేయకుండా మధ్య మధ్యలో విరామం తీసుకోవడం చేయాలి. కీబోర్డు, మౌస్‌లను సమానస్థాయిలో ఏర్పాటుచేసుకోవాలి.
- కంటి వ్యాయామం విషయంలోనూ అశ్రద్ధ పనికిరాదు. తలను ఏ మాత్రం కదల్చకుండా కళ్లను వీలైనంత పైకి, కిందకు, ఎడమ, కుడి పక్కలకు తిప్పి కాసేపు చూడాలి. తలను విశ్రాంతి దశలోనే ఉంచి చూపును క్లాక్‌వైజ్, యాంటీక్లాక్వైజ్ తిప్పాలి. ఇలా చేయడం వల్ల కండ్లకు సరియైన వ్యాయమంతో పాటు విశ్రాంతి దొరుకుతుంది. అందమైన, ఆరోగ్యకరమైన నయనాలు మీ సొంతం అవుతాయి.