Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దగ్గినా, తుమ్మినా.. చేతుల్ని అడ్డు పెట్టుకుంటాం. అయితే ఆ తరువాత చేతుల్ని తుడిచేసుకుంటే సరిపోదు. అలా అడ్డుపెట్టుకున్నప్పుడల్లా సబ్బునీటిలో చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి.
- ప్రతి రోజూ ఒకటి లేదా రెండు ఖర్జూరం పండ్లు తింటే శరీరంలో అనవసరంగా చేరిన కొవ్వు తగ్గుతుంది. శరీరానికి కావలసిన చురుకుదనాన్ని పొందవచ్చు.
- రోజూ ఐదు రకాల పండ్లు, కూరగాయలు తినడం వల్ల గుండె పదిలంగా వుంటుంది. శరీరానికి ఏ రకమైన వ్యాధి రాకుండా ఉండేందుకు ఈ పండ్లు, కూరగాయలు చాలా బాగా ఉపయోగపడతాయి.
- డయేరియా ఉన్నప్పుడు మజ్జిగ, పండ్ల రసం, కొబ్బరి నీళ్లు, మంచి నీళ్లు ఎక్కువగా తాగాలి. కూల్డ్రింకులు మాత్రం తీసుకోకూడదు.
- ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా రాళ్లు ఏర్పడకుండా నియంత్రించవచ్చు.
- నవ్వు వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా వ్యాధిని నయం చేసే యాంటీబాడీస్ బి-సెల్స్‌ను పెంచుతుంది.