Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాదం పప్పులు : మీకు సాయంకాలం పూట ఆకలి అయితే బాదం పప్పులు తినండి. ఇది చక్కటి చిరుతిండి. ఎందుకంటే కడుపూ నిండుతుంది, అదే విధంగా మీకు కూడా కాస్త ఆకలి తీరి శక్తి వస్తుంది.
ఆపిల్ : రోజుకో ఆపిల్ తింటే డాక్టర్‌కి దూరంగా ఉండడమే కాక, మీ క్యాలరీల స్వీకరణ కూడా తగ్గుతుంది. ఒక యాపిల్ కేవలం 100 కేలరీలు కలిగి వుంటుంది. అందుకని రోజుకో ఆపిల్ తినండి. ఎందుకంటే దాంట్లో వుండే కరిగే పీచు పదార్ధం వల్ల వాతావరణంలోని కాలుష్య కారకాల నుంచి రక్షణ అందుతుంది, కొలెస్టరాల్‌ను కూడా తగ్గిస్తుంది.
పల్లీలు : పల్లీలు చాలా ఆరోగ్యకరమైన, పోషక విలువలున్న చిరుతిండి. కనుక రోజుకు కొన్ని పల్లీలు తినండి. వాటిలో కేవలం 74 కేలరీలే వుంటాయి. అంతే కాదు, ఇవి తక్కువ గ్లూకోస్ కలిగి వుంటాయి కనుక శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి. దాని వల్ల చాలా సేపు కడుపు నిండిన అనుభూతి వుంటుంది.
ద్రాక్ష పళ్ళు : కడుపు నిండాలి తక్కువ కేలరీలు కావాలంటే ద్రాక్ష పళ్ళు సరైన మార్గం. 30 ద్రాక్ష పళ్ళు తినండి, ఎందుకంటే అవి రక్తహీనతను, అలసటను, కీళ్ళ నెప్పులను, కీళ్ళ వాతాన్ని, రుమాటిజంను తగ్గించడానికి దోహదం చేస్తాయి. కేవలం 100 కేలరీలు మాత్రమె కలిగి వుంటాయి.
పుచ్చకాయ : పుచ్చకాయలు మంచి డైట్ స్నాక్‌గా చెప్పుకోవచ్చు. దీనిలో నీటి శాతం ఎక్కుం. కాబట్టి ఒక పుచ్చకాయలో కేవలం 88 కేలరీలు మాత్రమే వుంటాయి.
టమాటో సూప్ : మీకు టమాటో తినడం ఇష్టం లేకపోతే టమాటో సూప్ తాగండి. ఎందుకంటే అది చాలా తేలిగ్గా తయారు చేయవచ్చు. కేవలం 74 కేలరీలు మాత్రమే కలిగి వుంటుంది.
చెర్రీ : రుచికరమైన ఈ పళ్లలో విటమిన్లు పుష్కలంగా వుంటాయి. కొవ్వు పదార్ధం కూడా తక్కువగా వుంటుంది. 25 చెర్రీలలో కేవలం 100 కేలరీలే వుంటాయి.
బ్లూ బెర్రీలు : ఒక కప్పులో బ్లూ బెర్రీలలో 83 కేలరీలు వుంటాయి. యాంటీ ఆక్సిడేంట్లు విరివిగా వుండి, వార్ధక్య ప్రక్రియను మందగింప చేస్తాయి. మీ గుండెను రకరకాల జబ్బుల నుంచి కాపాడతాయి.
కివీ పండు : కివీ నుండి విటమిన్ సి పుష్కలంగా అందుతుంది. రెండు కివీ పళ్ళను సాయంత్రం స్నాక్‌గా తీసుకోండి. కడుపు నిండుతుంది. వీటిలో కేవలం 58 కేలరీలే వుంటాయి. కాబట్టి సాయంత్రపు స్నాక్‌గా దీన్ని తీసుకోండి. అంతేకాక కివి పళ్ళు జీర్ణక్రియకు సాయం చేస్తాయి. ఆరోగ్యకరమైన మేని ఛాయను కూడా ఇస్తాయి.