Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలామందికి కంటి చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి. వీటిని తగ్గించుకోవడానికి మార్కెట్లో లభించే వివిధ రకాల క్రీములను వాడుతుంటారు. అలా కాకుండా ఇంట్లో లభించే వస్తువులతోనే ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
- గులాబీరేకుల పొడిలో అలోవెరా జెల్‌ను కలిపి రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
- బొప్పాయి, పుదీనా పౌడర్లను చందనం నూనెతో కలిపి నల్లటి చర్మంపై అప్లై చేయాలి.
- ఛాయపసుపులో దోసకాయ రసం కలిపి రాసినా మంచి ఫలితం ఉంటుంది.
- కాఫీపౌడర్ని కొబ్బరినూనెతో కలిపి రాస్తే నలుపు తగ్గుతుంది.
- అన్నింటికంటే ముఖ్యమైనది కంటివలయాలు దరిచేరకుండా ఉండాలంటే సరైన నిద్ర అవసరం.