Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వారానికి ఒకసారి స్క్రబ్ వాడితే అద్భుతమైన మార్పు కనబడుతుంది. ఇది జిడ్డు చర్మానికి బాగా ఉపయోగ పడు తుంది. పొడి చర్మానికి నెలకొక సారి ఉపయోగించినా చాలు. ముఖములోని ముడతల ద్వారా ఏర్పడిన మలినాలు వెంటనే తొలగి పోయి ముఖం కాంతివంతముగా తయారవుతుంది.
గోధుమ పిండితో : చెంచా ఓట్ మీల్ పౌడర్, చెంచా గోధుమ పిండి, చెంచా పాల పై మీగడ, చెంచా శాండల్ వుడ్ పౌడర్ (చందన పౌడర్) తీసుకుని వీటిని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని సన్నటి బట్టతో చేసిన సంచిలో నింపి ఆ సంచిని గోరువెచ్చని నీటిలో ముంచి దానిని ముఖానికి, మెడకు నెమ్మదిగా, గుండ్రంగా రుద్దాలి. ఈ విధంగా కనీసం 15 నిమిషాలు రుద్ది తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
నారింజ తొక్కలతో : నాలుగు చెంచాలు నారింజ తొక్కల పొడి, రెండు చెంచాలు ఓట్ మీల్ పౌడర్, రెండు చెంచాలు గోధుమపిండి తీసుకుని బాగా కలిపి గాలి తగలకుండా మూత పెట్టిన పాత్రలో ఉంచి ఉపయోగించవచ్చు. జిడ్డు చర్మానికి కొద్ది నిమ్మరసం లేక దోసకాయ రసంను కలిపి సన్నటి బట్టతో చేసిన సంచిలో నింపి (మసలిన్ బేగ్) ముఖానికి రుద్దాలి.
పెసరపిండితో : నాలుగు చెంచాలు పెసరపిండి, నాలుగు చెంచాలు బేసన్, నాలుగు చెంచాలు శాండల్ వుడ్ పౌడర్ తీసుకుని బాగా కలిపి గాలి తగలకుండా ఏదైనా పాత్రలో ఉంచి ఉపయోగించుకోవచ్చు.
కాంప్లెక్షన్ స్క్రబ్ : చెంచా బాదంకాయ పొడి, చెంచా నారింజ తొక్కల పొడి, చెంచా ఓట్ మీల్ పొడి తీసుకుని బాగా కలిపి మూతపెట్టిన పాత్రలో ఉంచి ఉపయోగించుకోవచ్చు.