Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలంకరణలో డ్రెస్సులు, చెప్పులు వంటివే కాకుండా హెయిర్ స్టైల్‌ను మరింత అందంగా చూపించే హెయిర్ బ్యాండ్లకు కూడా మరింత క్రేజ్ పెరిగింది. డ్రెస్సులకు, హెయిర్ స్టైల్‌కు తగ్గట్టు రకరకాల మోడల్స్‌తో, స్టైల్‌లతో ఆదరగొడుతున్నాయి. హెయిర్ బ్యాండ్, రిబ్బన్లు ఇప్పుడు కొత్త తరహాలో లభిస్తున్నాయి. పెద్ద వారికోసమే కాకుండా పిల్లల కోసం కూడా ప్రత్యేకమైన హెయిర్ బ్యాండ్లు లభిస్తున్నాయి. దీనికోసం మార్కెట్లో అందమైన రంగుల్లో క్లాత్ కూడా లభిస్తుంది. మరికొన్ని ప్లాస్టిక్ వుండి నాజూకుగా వుంటాయి. గ్రీన్, పర్పుల్ ఇలా ఎవరికి నచ్చిన రంగులను వారు ఎంపిక చేసుకోవచ్చు. హెయిర్ బ్యాండ్స్, వేసే వస్త్రధారణ, షూలను బట్టి వుంటుంది. పుష్పాలు, సీతాకోకచిలుకలు, రకరకాల ప్రింట్స్లో చూడటానికి ఇంపుగా వుంటాయి. వేసుకునే దుస్తులను బట్టి హెయిర్ బ్యాండ్స్‌ను మ్యాచ్ అయ్యే విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో అన్ని రకాల లేటెస్ట్ ట్రెండ్ మోడల్ హెయిర్ బ్యాండ్లు దొరుకుతున్నాయి. వీటి ధర మాములుగా ఇరవై నుండి మొదలుకొని వేల రూపాయల వరకు కూడా లభిస్తున్నాయి. ఈ హెయిర్ బ్యాండ్ పిల్లల అందానికి మరింత సొగసును చేకూరుస్తుంది.