Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆస్ట్రేలియా పర్యటనకు 20 మందితో కూడిన మహిళల జట్టును హాకీ ఇండియా సోమవారం ప్రకటించింది. భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మూడు మ్యాచుల సిరీస్ మే 18 నుంచి ఆడిలైడ్‌లో జరుగనుంది. పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా-ఏ జట్టుతో సైతం రెండు మ్యాచులను భారత జట్టు ఆడనుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరుగనున్న ఆసియా క్రీడల సన్నద్ధతలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మూడు మ్యాచుల సిరీస్ షెడ్యూల్ చేశారు. భారత హాకీ జట్టుకు సీనియర్ గోల్ కీపర్ సవిత కెప్టెన్‌గా ఎంపికైంది. డిఫెండర్ దీప్ గ్రేస్ ఎక్కా వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది. ఇటీవల బల్బీర్‌సింగ్ సీనియర్ హాకీ ఇండియా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న సవిత.. ఆస్ట్రేలియాపై సిరీస్‌లో భారత్‌కు సారథ్యం వహించనుంది. స్టార్ స్ట్రయికర్ వందన కటారియ ఎదురుదాడికి నాయకత్వం వహించనుంది.
భారత మహిళల హాకీ జట్టు : సవిత (కెప్టెన్), బిచు దేవి కారిబామ్ (గోల్ కీపర్లు). దీప్ గ్రేస్ ఎక్కా (వైస్ కెప్టెన్), నిక్కి ప్రధాన్, ఇషిక చౌదరి, ఉదిత, గుర్జిత్ కౌర్ (డిఫెండర్లు). నిశా, నవజ్యోత్ కౌర్, మోనిక, సలీమ టెటె, నేహా, నవనీత్ కౌర్, సోనిక, జ్యోతి, బల్జీత్ కౌర్ (మిడ్ ఫీల్డర్లు). లాల్రామ్సెమి, వందన కటారియ, సంగీత కుమారి, షర్మిల దేవి (ఫార్వర్డ్స్).