Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పోర్ట్స్‌మ్యాన్ ఆఫ్ ఇది ఇయర్ పురస్కారం సొంతం
పారిస్ : ప్రపంచ ఫుట్‌బాల్ సూపర్‌స్టార్, అర్జెంటీనా జాతీయ కెప్టెన్ లియోనల్ మెస్సి మరో ప్రతిష్టాత్మక పురస్కారం సొంతం చేసుకున్నాడు. ప్రఖ్యాత లారెస్ స్పోర్ట్స్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు. 1986 తర్వాత అర్జెంటీనాకు తొలి ఫిఫా ప్రపంచకప్ విజయాన్ని అందించిన లియోనల్ మెస్సి.. ఇటీవల ముగిసిన ఖతార్ ఫిఫా ప్రపంచకప్‌లో కీలక గోల్స్ కొట్టడంతో పాటు సహచరులకు గోల్ అవకాశాలు కల్పించి జట్టును ముందుండి గెలుపు పథాన నడిపించాడు. అవార్డు రేసులో కిలియన్ ఎంబపె, రఫెల్ నాదల్, స్టిఫెన్ కారీ, మోండో డుఫ్లాంటిస్, మాక్స్ వెర్స్టాపన్లు సైతం పోటీపడ్డారు. ఫిఫా ప్రపంచకప్ విజయ సారథి అత్యధిక ఓట్లను సొంతం చేసుకున్న లియోనల్ మెస్సి 2023 స్పోర్ట్స్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు. 2020లోనూ లారెస్ స్పోర్ట్స్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన మెస్సి.. స్పోర్ట్స్టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు నెగ్గిన జట్టులో మూడుసార్లు సభ్యుడిగా నిలిచాడు. దీంతో అత్యధికంగా ఐదుసార్లు లారెస్ పురస్కారం దక్కించుకున్న ఆటగాడిగా లియోనల్ మెస్సి సరికొత్త చరిత్ర సృష్టించాడు. లారెస్ అవార్డును అర్జెంటీనా ప్రజలకు అంకితం ఇస్తున్నట్టు లియోనల్ మెస్సి తెలిపాడు.