Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిఎం కప్ 2023లో కీలక బాధ్యతల అప్పగింత
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిఎం కప్ 2023 టోర్నీ నిర్వహణలో జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం (హెచ్ఐఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్‌రావుకు కీలక బాధ్యతలు అప్పగించారు. సిఎం కప్ పోటీల నిర్వహణపై క్రీడా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, శాట్స్ చైర్మెన్ డాక్టర్ ఆంజనేయగౌడ్‌లు బుధవారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో జగన్మోహన్ రావును రాష్ట్ర స్థాయి పోటీల ప్రారంభోత్సవ కమిటీ చైర్మన్‌గా నియమించారు. మే 28 నుంచి 31 వరకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియం, సరూర్‌నగర్ స్టేడియం సహా పలు వేదికల్లో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది క్రీడాకారులు రానున్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పోటీపడే క్రీడాకారులకు వసతి, భోజన, రవాణ సదుపాయాల కల్పన బాధ్యతలను జగన్ మోహన్‌రావు సారథ్యంలోని కమిటీ పర్యవేక్షించనుంది. ' నాపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన మంత్రి, శాట్స్ చైర్మెన్‌కు కృతజ్ఞతలు. క్రీడాకారుల ప్రగతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిఎం కప్ పోటీలను విజయవంతం చేసేందుకు నా వంతు కృషి చేస్తాను' అని జగన్మోహన్ రావు తెలిపారు.