Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటైనా.. ధాన్యం కొనుగోలు చేయడంలేదని రైతులు అవేదన వ్యక్తంచేస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు సరిగాలేవని, మ్యాచర్ వంటి సాకులు చూపిస్తూ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కాకుండా కటింగ్లకు పాల్పడి ఆ మద్దతు ధరలో నుంచి కోత విధించి మిల్లుల యాజమాన్యం చేస్తున్న చర్యలు సరైనవి కావు. తాలు, తేమ శాతమని మిల్లు యజమానులు దోచుకుంటున్నారు. క్రితం పంట వర్షానికి దెబ్బతిని రైతులు ఇబ్బంది పడితే ఇప్పుడేమో తాలు, తేమ, డ్యామేజ్ ఉన్నాయని వడ్లు కొనడం ఆపేశారు. రైతు బాధను అర్థం చేసుకొని ప్రభుత్వం దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలి. దళారీ వ్యవస్థ రూపు మాపి నేరుగా ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం నడుపుతున్న (ఐకేపీ, పీఎసీఎస్ ) కేంద్రంలో కూడా ఈ దళారులు కమిషన్లు ఇచ్చి ఇక్కడ అధికారుల, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రవేశించి ధాన్యాన్ని రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసి మార్కెట్లలో పోసి ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకు అమ్ముకొని రైతులను మోసం చేస్తున్నారు. ఈ దళారుల తెచ్చిన ధాన్యానికి రాని తాలు, తేమ, డ్యామేజ్.. రైతుల ధాన్యానికి రావటం ఎమిటో? అర్థంకాని పరిస్థితి. ప్రభుత్వం ఆఖరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తాం అని చెప్పి ఇలా మార్కెట్లలో ఉంచుకోవడం సరికాదు. ఇప్పుడున్న పరిస్థితులలో ఎండలు, కరోనా వ్యాధి వలన రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని వెంటనే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి వారి అకౌంట్లలో త్వరగా డబ్బు వేసేలా చర్యలు తీసుకొని వారిని ఆదుకోవాలి. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంటతెగుళ్ళకు అనేక మందులు కొట్టి అప్పుల పాలయిన రైతులకు మద్దతునీయాల్సిందిపోయి, వారికి నష్టం చేకూరుస్తుంటే రైతును ఆదుకునేది ఎవరు..?
జాజుల దినేష్,
నల్లగొండ. 9666238266