Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భరతమాతని నిత్య బాలింతతో పోల్చిన ఘనత జాషువాకే దక్కుతుంది. మన దేశంలో ప్రతిరోజూ వేల సంఖ్యలో జనాబా పుడుతున్నారు. అయినా జనులందరిని మాత ఓపిగ్గా పెంచుతుందనే అర్థంలో కవి వివరించారు. ఫిరదౌసిలో ఆయన ప్రకృతిని అద్భుతంగా వర్ణించారు.
తాను ఎదుర్కొన్న వివక్షతను కవిత్వంగా మల చడంతో జాషువ అణగారిన వర్గాలకి దగ్గరయ్యారు. శ్రీశ్రీ కవిత్వం జనులకు ఉత్తేజం కల్గిస్తుంది. ఉద్యమలవైపు వారిని పరుగెత్తిస్తుంది. జాషువ కవిత్వం సమస్య లని విశ్లేషిస్తుంది. ప్రజలని ఆలోచింప జేస్తుంది.
గుఱ్ఱం జాషువ 1895 సెప్టెంబర్ 28న వినుకొండ సమీపంలో చాట్రగడ్డపాడులో జన్మించారు. ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించారు.1956 నుంచి 1960 వరకు ఆకాశవాణి మద్రాస్ కేంద్రంలో తెలుగు ప్రొడ్యూసర్గా ఉద్యోగం నిర్వహించారు. ఆయన రచించిన 'క్రీస్తు చరిత్ర' కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కవికోకిల, నవయుగ కవిచక్రవర్తి, కవితా విశారదగా పేరు పొందారు.
జాషువ ప్రజల భాషలో కవిత్వం రాశారు. భరతమాతని నిత్య బాలింతతో పోల్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. మన దేశంలో ప్రతిరోజూ వేల సంఖ్యలో జనాబా పుడుతున్నారు. అయినా జనులందరిని మాత ఓపిగ్గా పెంచుతుందనే అర్థంలో కవి వివరించారు. ఫిరదౌసిలో ఆయన ప్రకృతిని అద్భుతంగా వర్ణించారు. గిజిగాడు అనే ఖండకావ్యంలో మానవులకు కూడా సాధ్యంకాని విధంగా గిజిగాడు పక్షి గడ్డిపోచలతో గూడుని కట్టుకోవడాన్ని జాషువ చక్కగా వర్ణించారు. ఆయన రచనలలో గబ్బిలం విశిష్టమైనది. అందులో ఆయన శ్రమజీవుల గురించి ఇలా అంటారు..
వాని రెక్కల కష్టంబు లేనినాడు/సశ్య రమ పండి
పులకింప సంశయించు/
వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకి భోజనము బెట్టు వానికి భుక్తి లేదు. శ్రమజీవులు కష్ట పడి పంటలు
పండించి ప్రపంచానికి అన్నం పెడతారు. తీరా వారు తిందాం అంటే వారికి అన్నం ఉండదు అని ఆవేదన వ్యక్తం చేశారు. జాషువ తన కవిత్వం ద్వారా మనదేశంలో అంటువ్యాధిలా వ్యాపిస్తున్న అంటరానితనాన్ని ప్రశ్నించారు. కుల వ్యవస్థకి వ్యతిరేకంగా గళమెత్తారు. ముప్పైకి పైగా రచనలు చేసిన జాషువ 1971 జులై 24న తుదిశ్వాస విడిచారు.
- ఎం. రాంప్రదీప్
సెల్: 9492712836