Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్‌లలో మనకందరికీ సుపరిచితమైన పదం ''ఇమ్యూనిటీ పవర్''(రోగ నిరోధక శక్తి). దీన్ని సాధారణంగా మనం తినే ఆహారంలోని పోషకాల ద్వారా పెంపొందించుకోవచ్చు. మన ప్రాచీన, సంప్రదాయపు ఆహారపు అలవాట్లయిన చిరు ధాన్యాల(మిల్లెట్స్)ను ఆహారంలో తీసుకోవడం ఎప్పుడైతే మనం మరిచిపోయామో, ఫిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్, ఫప్స్ వంటి పోషకాలనేవి అసలే లేని తిండిని అలవాటు చేసుకొని, చిన్న చిన్న జబ్బులను సైతం తట్టుకునే శక్తి మన శరీరాలకు లేకుండా ప్రతీ చిన్న అనారోగ్య సమస్యలకు ఔషదాలపై ఆధారపడి బతుకెళ్లదీయాల్సిన దుస్థితి నెలకొంది. ఆహారాన్నే ఔషధంగా తీసుకోవాలన్న మాట అక్షర సత్యం. సాధారణంగా నలబై యేండ్లు దాటిన వారికి 'షుగర్' అనే చేదు వేధిస్తున్న మాట వాస్తవం! తమతో పాటు ప్రయాణంలో మందు బిళ్ళల పత్తలను వెంటపెట్టుకొని, తినడానికి ముందు, తర్వాత ట్యాబ్లేట్స్ వేసుకోవడం పరిపాటిగా మారింది. ఇందుకు వరి అన్నాన్నే మూడు పూటల భుజించడం, అందులోని అధిక మోతాదులో ఉండే కార్బోహైడ్రేట్లే కారణం. రైతులు కూడా చిరు ధాన్యాలు పండించడానికి ఇష్టపడకపోవడానికి కారణం ప్రభుత్వాలు సజ్జ, జొన్న, రాగులు, అరికెలు సామలు, ఊదలు, కొర్రలు, అండు కొర్రలు వంటి చిరు ధాన్యాల పంటలపై సబ్సిడీలు, తగిన ధరలు, అవగాహనను కల్పించకపోవడమే. సమతుల, నాణ్యమైన పౌష్టికాహారం పొందలేక 2021లో ప్రపంచ ఆకలి సూచీలో (+శ్రీశీbaశ్రీ నబఅస్త్రవతీ ×అసవఞ) 116 దేశాల్లో భారత దేశం స్థానం గణనీయంగా 101వ స్థానానికి పడిపోయి అనారోగ్య భారతాన్ని ఆవిష్కరించిన ఘనత పాలకులదే! కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ గణాంకాలను, దీనికనుసరించిన పద్ధతులు ఆశాస్త్రీయ మైనవని, అహేతుకమని కొట్టిపారేసి నప్పటికీ, వాళ్ళు తీసుకున్న నాలుగు అంశాలైన పోషకాహార లోపం, చిన్నారుల్లో వయసుకు తగిన ఎత్తు లేకపోవడం, వయసుకు తగిన బరువు లేకపోవడం, చిన్నారుల మరణాల మీద స్వీయ సమీక్ష చేసుకోవాల్సిన ఆవశ్యకత ప్రస్తుత పాలకుపై ఉంది. వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన కొత్త కొత్త టెక్నాలజీలు శిశు మరణాల రేటును తగ్గించిన మాట వాస్తవమే అయినప్పటికీ, మారిన ఆహారపలవాట్లు, మానసిక ఒత్తిడిల వల్ల సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గిపోవడం విశ్లేషకుల అంచనాలకు సైతం అందకుండా ఉంది.
సిరి(చిరు) ధాన్యాలు (మిల్లెట్స్)గా పిలువబడే సజ్జలు, జొన్నలు, రాగులు, అరికెలు, సామలు, కొర్రలు, అండుకొర్రలు, ఊదలు, వరిగెలు వంటివి నేడు ధనవంతుల ఆహారంగా పిలువబడుతున్నాయి. ఇందులో మనకు అవసరమైన పోషకాలు విటమిన్ బీ, ఐరన్, ఫైబర్, ప్రోటీన్స్, మినరల్స్, కాల్షియం, కాపర్, జింక్, మెగ్నీషియం, ఫ్యాటీ ఆసీడ్స్, విటమిన్ బి6, ఫోలిక్ ఆసిడ్, గ్లుటిన్ ఫ్రీ, పొటాషియం, విటమిన్ ఇ, బోరాన్, మాంగనిస్, పాస్పరస్, సల్ఫర్ వంటివి సమృద్ధిగా దొరుకే వీటిని తీసుకోవడం వల్ల సంతాన లేమి, థైరాయిడ్, రక్తహీనత, నిద్రలేమి, కంటి చూపు, హార్మోన్ల సమస్యలు, షుగర్, బీపీ, చర్మ సమస్యలు, గుండె జబ్బులు, ఊభకాయం, అజీర్తి వంటి సమస్యలు ఎదుర్కొవడంతో పాటు రోగ నిరోధక శక్తి పెరిగి కోవిడ్ భారిన పడకుండా, చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు శరీరం తనంతట తానే రోగాన్ని నయం చేసుకోగలుతుంది. ఇవన్నీ సమృద్ధిగా దొరికే మిల్లెట్స్‌ను మనం మన పిల్లలకు తినిపించకుండా, కార్పొరేట్ కంపెనీల అడ్వర్టైజ్మెంట్లకు ఆకర్షితులై మార్కెట్లో దొరికే సహజసిద్దం కాని ఉత్పత్తులను తినిపిస్తూ, ఆర్గానిక్ ఫుడ్‌కి దూరం చేస్తూ, వాటివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌తో రోగాలను కొని తెచ్చుకొని, కష్టపడి సంపాదించి నదంతా అప్పనంగా ఆసుపత్రుల పాలు చేస్తున్నాం. మార్కెట్లో ఏ వస్తువు కొన్నా కల్తీవే అధికంగా ఉంటున్నాయి. వంట నూనెలు మొదలుకొని తీసుకునే ఔషధాలు సైతం నాణ్యమైనవి దొరక్కపోవడం, తద్వారా శరీరంలో సహజంగా ఉండే రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధుల బారిన పడటం జరుగు తున్నది. డా. ఆండ్రి కార్టన్ అనే పరిశోధకులు మనిషిలో ×Q(×అ్వశ్రీశ్రీఱస్త్రవఅ్ నబశ్ీఱవఅ్) కంటే జుQ(వఎశ్ీఱశీఅ నబశ్ీఱవఅ్) ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే జీవితంలో ఎక్కువ విజయాలు సాధించారని తెలిపారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలంటే సరైన పోషక విలువలున్న పౌష్టికాహారం తీసుకోవాలి. ఒక్కో పోషకం కోసం వేరు వేరుగా తినకుండా చిరు ధాన్యాల మిశ్రమాన్ని తీసుకోవడం ఎంతో ఉపయోగం.
- ముఖేష్ సామల
సెల్:9703973946