Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆహార అలవాట్లు, పండించిన పంటలు ప్రకృతితో ముడిపడి ఉండేవి. కానీ ప్రస్తుతం పాతరోజుల్లో అనేక మార్పులు సంభవించి లాభాపేక్ష, అధిక దిగుబడి ధ్యేయంగా పంటలు పండింస్తున్నారు. ఈ ఆహార ధాన్యాలు సేవించి ప్రతి మనిషి నిత్యం ఏదో ఒక రోగంతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ రోగాలను నయం చేసేందుకు అనేక రకాల మందులు మార్కెట్లోకి వచ్చినవి. ఈ మందులు అత్యంత ఖరీదైనవి, సామాన్యులకు అందుబాటులో ఉండడం లేదు. పెద్ద పెద్ద కంపెనీలు బ్రాండెడ్ పేర్లతో అనేక రకాల మందులను రంగురంగుల సిట్రిపులతో మార్కెట్లోకి విడుదల చేసి సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. డాక్టర్లు కూడా ఇవే మందులను చీటిలపై రాసి ఈ మందులను వాడకపోతే రోగం నయం కాదనే స్థితికి మనుషులను తీసు కొచ్చారు. డాక్టర్లు ఈ మందుల కంపెనీలతో కుమ్ముక్కై ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. అసలు మన దేశంలో ఈ బ్రాండ్ పేరుతో తయారవుతున్న ఔషధాలు విదేశాల బ్రాండెడ్ కంపెనీల నుండి కాపీ చేసి ఇక్కడ బ్రాండడ్ పేరెన్నికగన్న కంపెనీల పేరుతో మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీలు తయారు చేసే మందుల పై వారికి పేటెంటు హక్కు 17 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆ తరువాత ఈ మందులు జనరిక్గా మార్కెట్లో విడుదల వుతాయి. ప్రస్తుతం మన దేశంలో ఈ తరహా వ్యవహారం ఔషధాల అమ్మకాలలో జరుగు తున్నది. అమెరికాలో దాదాపు 60శాతం జనరిక్ మందుల వినియోగిస్తారు .స్పెయిన్ దేశంలో తప్పనిసరిగా జనరిక్ ఉపయోగిం చాలి అని చట్టం కూడా చేసుకొన్నారు. కానీ ఇండియాలో చౌకగా లభించే ఈ జనరిక్ మందుల వినియోగా నికి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే మన దేశంలో డ్రగ్ మాఫియా ఏలుబడి రాజ్యం సాగిస్తున్నది. డాక్టర్లకు బహుమతులు ఆశ చూపి తప్పనిసరిగా తమ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న మందులను రోగులకు రాయాలని శాసిస్తున్నది. డాక్టర్లకు వినోదాలు విందులు రకరకాల బహు మతులు, విదేశాలకు విహార యాత్రకు రకరకాల ఏర్పాట్లు చేసి వారి ద్వారా ఈ డ్రగ్ మాఫియా ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నది. మన దేశంలో దాదాపు 20ఏండ్ల క్రితమే జనరిక్ మందులు వాడుకలోనికి వచ్చినా తగినంత ప్రచారం లేక ప్రజలు వీటి వైపు మొగ్గు చూపటంలేదు. ఇంకా ఈ మందులపై పలు అనుమానాలతో కొనడానికి ముందుకు రావడం లేదు. వీటిలో దాదాపు 200 రకాల మందులు 20 నుంచి 80శాతం తగ్గుదలతో లభిస్తున్నవి. బిపి, షుగర్, దగ్గు జ్వరం మొదలైన వాటికి మందులు చౌకగా లభ్యమవు తున్నాయి. కానీ డాక్టర్లు ఈ జనరిక్ మందులు చీటీలలో రాయడం లేదు. గజిబిజి రాతలతో ప్రజలకు అర్థంకాక సతమతమవుతున్నారు. ఒక్కొక్కసారి మందుల దుకాణాలు వారు కూడా ఈ రాతలతో తంటాలు పడు తుంటారు. డాక్టర్లు తప్పనిసరిగా జనరిక్ మందులు స్పష్టంగా తెలిపినట్లు రోగి నిర్ధారణ పత్రంలో రాయుటకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. లేనిచో వారి గుర్తింపును రద్దు చేయాలి. జనరిక్ మందుల వైపు ప్రజలకు అవగాహన కల్పించుటకు ప్రభుత్వం విస్తృతమైన ప్రచార ఏర్పాట్లు చేయాలి. రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లో, పాఠశాలల్లో, దవాఖానాల వద్ద ఇంకా ఇతర ముఖ్య ప్రదేశాలలో ఫ్లెక్సీలు పెట్టాలి. పత్రికలు, టీవీలలో విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలు జనరిక్ మందులు వాడేటట్లు చూడవలసిన బాధ్యత ప్రభుత్వా నిది. తద్వారా ప్రజలను ఆర్థిక ఇబ్బందుల నుంచి దూరం చేయవచ్చు. విధిగా ప్రభు త్వ ప్రయివేటు హాస్పిటలలో కూడా జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేయాలి.
- డి. రామచందర్రావు
సెల్: 9849592958