Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవలి కాలంలో ప్రపంచంలో మొబైల్ ఫోన్లు బాగా వృద్ధి చెందాయి. ప్రజలంతా మొబైల్ ద్వారా సంప్రదింపులు చేస్తున్నారు. వేరు వేరు చోట్ల నివాసం ఉండే ప్రజలు, కేవలం మొబైల్ ఫోన్ ద్వారా సంభాషించుకోవడానికి బాగా అలవాటు పడ్డారు. మొబైల్ ఫోన్లు వ్యక్తుల జీవితాలపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. అయితే మొబైల్ వలన ప్రజలకు లాభాలు ఉన్నట్టే, నష్టాలు కూడా ఉంటాయి. సుదూర ప్రాంతాలలో నివసించే స్నేహితులతో, బంధువులతో వెనువెంటనే సంభాషణలు చేయవచ్చును. వీడియో కాలింగ్ ద్వారా కూడా ఒకరినొకరు చూసుకుంటూ సంభాషించు కోవచ్చును. ఈవిధంగా స్మార్ట్ ఫోన్ ప్రజల మధ్య కమ్యూనికేషన్‌కు బాగా ఉపయోగపడుతుంది. వ్యాపారస్తులకు కూడా స్మార్ట్‌ఫోన్ చాలా ఉపయోగం. ఇంటర్నెట్ ద్వారా అనేక విషయాలను స్మార్ట్‌ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చును. పాటలు వినవచ్చును. వీడియోలు చూడవచ్చును. వివిధ అప్లికేషన్స్ ద్వారా కొన్ని కంప్యూటర్లో చేయగలిగే పనులు కూడా స్మార్ట్ ఫోన్ ద్వారా చేసుకోవచ్చును. మొబైల్స్ మన జీవితంలో భాగమైపోతున్నాయి. స్మార్ట్‌ఫోన్ ప్రయోజనకారిగా ఉంటూ, మనకు నష్టం కూడా చేస్తున్నదని భావించాలి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ నుండి వచ్చే రేడియేషన్ వ్యక్తి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇంకా పిల్లలకు స్మార్ట్ ఫోన్ అలవాటుగా మారుతూ, వారిని భౌతిక ఆటలకు దూరం చేయడంలో స్మార్ట్ ఫోన్ ప్రభావం చూపుతుంది. అంతే కాదు కొందరికి స్మార్ట్‌ఫోన్ వ్యసనంగా మారుతోంది. కొందరు ఆటలు ఆడుతూ స్మార్ట్ ఫోనుతోనే ఎక్కువగా కాలం గడిపేస్తూ ఉంటారు. కొందరు వీడియోలు చూస్తూ స్మార్ట్ ఫోనుతోనే మమే కమవుతారు. ఏదో ఒక అంశం స్మార్ట్ ఫోను వ్యక్తిని ఆకర్షిస్తూ, అతన్ని భౌతిక సమాజం నుండి దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగాక కుటుంబ జీవనంలో కూడా వ్యత్యాసాలు వస్తున్నాయనేది నిజం. ఉపయోగించుకుంటే స్మార్ట్‌ఫోన్ ద్వారా అనేక విద్యా విషయాలను తెలుసుకోవచ్చును. అలాగే అనవసర విషయాల వైపు కూడా ఆకర్షితులయ్యే అవకాశం స్మార్ట్‌ఫోన్ వలన అధికంగా ఉంటుంది. ఇంకా స్మార్ట్ మోసాలు కూడా పెరుగుతూ, డబ్బులు పోగొట్టుకునేవారు కూడా మనకు వార్తాసమాచారంలో కనబడుతూ ఉంటారు. ఏదైనా ఒక వస్తువుని ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఉపయోగిస్తే, ఆ వస్తువు అతనికి ఉపకారిగా మారుతుంది. అదే వస్తువుతో ఎక్కువసేపు గడిపితే ఆ వస్తువు అతనికి లాభం కన్నా నష్టం ఎక్కువ చేస్తుంది. ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు స్మార్ట్ ఫోన్ ముందుగా నష్టపరిచేది, వ్యక్తిని ఒంటరిని చేయడమే. పిల్లలు అన్నం తినడానికి, పేచి పెడుతుంటే చందమామను చూపిస్తూ, వారికి కథలు చెబుతూ అన్నం తినిపించేవారు. కానీ ఈ స్మార్ట్ కాలంలో ఉన్న తల్లులు స్మార్ట్‌ఫోనులో పిల్లల వీడియోలు పెడుతూ అన్నం తినిపించడం చూస్తున్నాం. దీని వలన రేడియేషన్ కలిగిన ఫోన్ చిన్ననాటి నుండే పిల్లలతో మమేకం అవుతుంది. రేడియేషన్ ఎంత హానికరమో వైద్యులు చెబుతూనే ఉన్నారు. కానీ కొందరు చేసే ఈ పనుల వలన పిల్లలకు చిన్ననాటి నుండే స్మార్ట్ఫోనే అంటే ఆసక్తి పెరుగుతోంది. చదువుకునే వయస్సులో టీచర్ ద్వారా చెప్పబడే పాఠాలు వినడం వలన విద్యార్థికి ఊహాశక్తి పెరుగుతుంది. కానీ స్మార్ట్‌ఫోన్ ద్వారా తెలుసుకోవడం వలన ప్రయోజనం కన్నా స్మార్ట్‌ఫోన్‌పై ఆధారడడానికి అలవాటు పడే అవకాశం ఎక్కువ అంటారు. మొబైల్ ఫోన్లు రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్‌ను విడుదల చేస్తాయి, ఇది వాటిని కవరేజీని అందించే సెల్ టవర్లకు కలుపుతుంది. స్మార్ట్ఫోన్లు విడుదల చేసే సిగల్‌ను ఎలక్ట్రోమాగెటిక్ రేడియేషన్ లేదా ఈఏంఎఫ్ అంటారు. ఈ విద్యుదయస్కాంత వికిరణం ఇతర రకాల రేడియేషన్లను కవర్ చేస్తుంది, అవి మొబైల్ ఫోన్లను ఉపయోగించినప్పుడు ఉత్పత్తులుగా విడుదలయ్యే వేడి, మైక్రోవేవ్‌లు వంటివి.
మన మొబైల్ ఫోన్లను మన చెవులకు దగ్గరగా ఉంచినప్పుడు, రేడియో తరంగాలు నేరుగా మన మెదడులోకి ప్రవేశిస్తాయి. ఇది మన మొత్తం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం మొబైల్ ఫోన్ వినియోగం ద్వారా అనారోగ్యం భారిన ప్రభావం ఉండే అవకాశం ఉంది.
పిల్లలు వారి శరీరాలు ఇంకా అభివృద్ధి చెందుతున్నందున మొబైల్ ఫోన్ల చెడు ప్రభావాలతో చాలా హాని కలుగుతుంది. అంతేకాకుండా, ఫోన్లను తమ చేతుల్లో, జేబుల్లో లేదా బ్యాగ్‌లలో తీసుకెళ్లడం వల్ల ఈఏంఎఫ్కు ఎక్కువ బహిర్గతం అవుతుంది. పిల్లలు నిద్రపోతున్నప్పుడు ఫోన్లను వారి తలలకు దగ్గరగా ఉంచడం వలన ఈ బహిర్గతం కొనసాగుతుంది. మొబైల్ ఫోన్‌ను ఉపయోగించడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటంటే అవి కమ్యూనికేషన్ మోడ్‌ను సులభతరం చేయడం, చౌకగా చేయడం. దాదాపు 95శాతం మంది ప్రజలు కమ్యూనికేషన్ కోసం మొబైల్ ఫోన్లను ఉపయోగించే టెలికాం పరిశ్రమలో ఒక విప్లవం. మొబైల్ కమ్యూనికేషన్‌ను సులభతరం చేసింది కేవలం మొబైల్లో కొన్ని కీలను నొక్కడం ద్వారా, తోటి స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా సహౌద్యోగులను, ఇతరులను ఎప్పుడైనా సంప్రదించవచ్చు. వాయిస్ కాల్లు, వీడియో కాల్లు, టెక్స్ మెసేజ్‌లు, రికార్డ్ చేసిన కాల్లు మరెన్నో వాటితో మన తోటి వ్యక్తిని సంప్రదిం చడానికి మొబైల్ సదుపాయాన్ని కూడా అందిస్తుంది.
వర్చువల్ పరివర్తన కుటుంబంలోని ప్రతి సభ్యుడిని ఏకాంతంగా ఉంచింది. యువ కాశ్మీరీలు ఇంటర్నెట్ను అధికంగా ఉపయోగించడంతో నిమగమైనట్టు సర్వేల ద్వారా అందిన సమాచారం. అందుకే అవసరానికి మించి మొబైల్‌ను వాడకూడదు. అది అనారోగ్యమే కాదు దుష్ఫ్రలితాలను ఇస్తుంది. మంచి కోసం మాత్రమే మొబైల్‌ను వాడాలి తప్ప చెడును ప్రోత్సహించే విధంగా వాడకం ఉండకూడదు. ఆ దిశగా తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ ప్రయత్నం చేయాలి.
- మోటే చిరంజీవి
9949194327