Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మీరు మా కొడుకు లాంటి వాళ్లు, మీకేం చెప్పమంటారు?'' అని వాళ్లు అనగానే ఒక్కసారి నా గుండె ఆగి నా మరణం నన్ను పిలిచినట్టు అనిపించింది. వాళ్లు ఎవరో కాదు, పగలు గుడిలో ప్రవేశానికి అర్హత లేని, రాత్రి అయితే అదే గుడిలో ఊళ్లోని కామ వాంఛతో రగిలే ప్రతి మగాడూ వాడుకునే ''శరీరాలు''... నాగరిక సమాజం సాంప్రదాయపు అంగడి బొమ్మలు.. ''జోగినీలు''.
వాళ్లు చెప్పే ప్రతి మాట నా గుండెల్లో గునపం దింపి కండ్ల నుంచి కన్నీరు ప్రవహిస్తుంటే వాళ్లను ఇంకా ఇబ్బంది పెట్టొద్దని వాటిని అక్కడే ఆపేసిన... ఆ తల్లులపై ఆనాటి సమాజం చేసిన వికత చేష్టలకు, నేటి సమాజం వారిని చిన్న చూపు చూస్తుందని, వారి పిల్లలను మానసికంగా వేధిస్తూ, వెక్కిరిస్తున్నారని ఒక్కొక్కరు వాళ్ల బాధను చెప్తుంటే వారి కంటి నుండి కారుతున్న ''ఆ కన్నీరు కూడా ఏడుస్తుంది''.
సష్టికి మూలం స్త్రీ అని చెప్పే సమాజం కామవాంఛతో, మూఢాచారంతో, మగ బిడ్డ పుట్టాలనే మమకారంతో, దేవుడికిచ్చి పెండ్లి చేసి అదే దేవుడి భార్యతో వెర్రి కామ కోరికలు తీర్చుకోడానికి కామాంధులకు స్థానం కల్పించిన సమాజం. వయసులో ఉన్నప్పుడు వాడుకొని, ఇప్పుడు ఒంటిపైకి ముసలి తనం రాగానే మనుషుల్లా కూడా చూస్తలేరని అంటున్నప్పుడు ఆ కంట కారుతున్న కన్నీరు కూడా ఏడుస్తుంది. ''మా శరీరం అంత పుండు అయ్యింది, ఎంతోమంది జోగినీలు క్షయ, ఎయిడ్స్‌తో చచ్చిపోయారు. మా గతి ఏం కానుందో? మా తరువాత మా బిడ్డల పరిస్థితి ఏందో?'' అంటూ కుమిలి కుమిలి ఏడుస్తుంటే .....ఆ కంట కారుతున్న కన్నీరు కూడా ఏడుస్తుంది.
ఇంత అభివద్ధి చెందిన కంప్యూటర్ సమాజం కూడా తమను వెక్కిరిస్తూ వేధిస్తోందని చెప్తూ కన్నీరు మున్నీరై గుండె పగిలేలా రోదిస్తుంటే ఆ కన్నీరు కూడా కంటతడి పెడుతుంది. మండుటెండల్లో నీడలేక మాడిపోతున్న బతుకులు వారివి. ఆ కంటి చూపుల్లో ఎన్నెన్నో అగాధాలు. సామాజిక వివక్షకు నిలువుటద్దంలా ఉన్నారు వారు. నా మనసు నిండా ప్రశ్నలే... నా గుండె నిండా రోదనే... ఇవి నేను జోగిని వ్యవస్థ గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు నాకు కలిగిన కొన్ని అనుభవాలు. వీటిని పంచుకోవాలి, మానవీయ హదయాలు స్పందించాలి, ఆ అభాగ్యుల కోసం ఒక్క ఆలోచన.... ఒక్క కన్నీటి చుక్క.... ఒక్క ప్రశ్న..... మీ గుండెల్లో మెదలాలి..... మానవ జాతి చరిత్రకే కళంకమైన ఈ దురాచారం మాసిపోవాలి. జోగినులుగా జీవచ్ఛవాలుగా బతుకు వెళ్లదీస్తున్న వాళ్లు కోరుకునే వాటిలో కొన్ని.. మిగిలిన శేష జీవితానికి ప్రభుత్వ తోడు. నేటి ఆడ పిల్లలను జోగినీలుగా మార్చొద్దు. బాల్య వివాహాలు చేయొద్దు. మనతో చదువుకుంటున్న వారి పిల్లలను అందరితో సమానంగా చూడడం. వారితోపాటు, వారి పిల్లలకు అన్ని రంగాల్లో ప్రత్యేక రేజర్వేషన్స్ కావాలని కోరుకుంటున్నారు. ఆ తల్లులను సమాజం, ప్రభుత్వం గుర్తించి తోడు నిలిచేలా అందరం ప్రయత్నిద్దాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయానికి వద్దాం.
- ఆజాద్ ఎర్రోల్ల
సెల్ : 8499994232