Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనువాద బ్రహ్మ ణీయ, సాంఘిక, సాంస్కృతిక భావజాల కేంద్రాలుగా విశ్వవిద్యాలయా లను పునరు ద్ధరించడానికి ప్ర యత్నాలు జరుగుతున్న సం దర్భమిది. విద్యాహక్కును, ఇతర ప్రజాతంత్ర హక్కులను రద్దుచేసే దిశగా పాలకవర్గ విధివిధానాలు రూపుదిద్దుకుంటున్న కాలమిది. 2005లో భారత విద్యారంగాన్ని సేవల రంగంలో చేర్చ డం ద్వారా గాట్ ఒప్పంద రథచక్రాలకు కట్టి వేసింది. ఫలితంగా ప్రజలకు విద్య అందించాలన్న సామాజిక బాధ్యత నుండి పాలకులు వైదొలిగారు. ఇది తమ బా ధ్యతకాదంటూ బహిరంగంగానే నిస్సిగ్గుగా ప్రకటిస్తు న్నారు. ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు అవసరమైన కమిషన్లను ఏర్పరిచి అనుకూలమైన సిఫార్సులను పొందుతున్నారు. బిర్లా, కుమారమంగళం, అల్ఫ్రెడ్, యశ్పాల్ తదితర కమిషన్ల సిఫార్సులే ఇందుకు ఉదాహరణ. చదువుకయ్యే ఖర్చు విద్యార్థే భరించాలి. విద్యారంగం నిర్వాహణకు అయ్యే వ్యయాన్ని స్వయంగా సమకూర్చుకోవాలన్నది ఈ సిఫార్సుల సారాంశం. పారిశ్రామిక రంగంలో ఉమ్మడి కంపెనీలు ఏర్పడినట్టే విద్యారంగంలోనూ స్వదేశీ, విదేశీ విద్యాసంస్థలు ఉమ్మ డిగా ఏర్పడుతున్నాయి. బిర్లా, అంబానీ, జిందాల్, టాటా వంటి కంపెనీలకు ''స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్ల''ను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించారు. తద్వారా ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. విదేశీ పెట్టుబడులు, విద్యాసంస్థలు మనదేశంలోకి ప్రవేశించడానికి పూర్తి స్వేచ్ఛ కల్పించారు. దీనితో విద్య అంగడి సరుకైంది. లాభాపేక్షతో అన్ని స్థాయిల్లో విద్యాసంస్థలు ఏర్పాటై నడుస్తున్నాయి. కొనుక్కున్నవారి కే చదువు అన్న నియమం ప్రకారం చదువులు కొనసా గుతున్నాయి. దీంతో ఉన్నత విద్య మౌలికంగా అంతర్జా తీయ చట్టబద్ద సరుకుగా మారింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)కు చట్టబద్ద విభాగమైన ట్రేడ్ పాలసీ రివ్యూ మెకానిజం (టీపీఆర్ఎం) మనదేశ ఉన్నత విద్యా చట్టాలను, కార్యకలాపాలను సమీక్షిస్తుంది. ఇది రాజ్యంగం కల్పించిన సమానత్వం, సమన్యాయ పంపి ణీ సిద్ధాంత స్ఫూర్తికే వ్యతిరేకం. సామాజిక న్యాయానికి విఘాతం. అందరికీ సమానత్వంతో కూడిన విద్య అం దుబాటులో లేకుండా సామాజిక అసమానతలు మరిం త పెరగడానికి దారితీస్తుంది. విద్యార్థుల మధ్య అంత రాలు, విద్యా అసమానతలు పెరుగుతాయి. విశ్వవిద్యా లయాల్లో ప్రజాస్వామిక వాతావరణం దెబ్బతిన్నది. వి ద్యార్థుల ప్రజాస్వామిక హక్కులకు తీవ్ర విఘాతం కలు గుతున్నది. విద్యార్థి సంఘ ఎన్నికలు లేకపోవడం ఇం దుకు నిదర్శనం. విశ్వవిద్యాలయాల నిర్వాహణకు అవ సరమైన విధివిధానాల రూపకల్పనలో విధిగా ఉండవ లసిన బోర్డ్ ఆఫ్ స్టడీస్, స్టాండింగ్ కమిటీ వగైరాలలో విద్యార్థులకు భాగస్వామ్యమే లేకుండా పోయింది.
దేశంలో బ్రాహ్మణీయ హిందుత్వ భావాజాలం వి ద్యారంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తూ విశ్వ విద్యా లయాలను వెంటాడుతున్నది. ప్రత్యామ్నాయ భావజా లం కలిగి ప్రశ్నించే విద్యార్థులపై భౌతిక దాడులకు, హత్యలకు పూనుకోవడం, వారిని అదృశ్యం చేయడం వంటి చర్యలకు హిందుత్వ శక్తులు పాల్పడుతున్నాయి. ఢిల్లీ జేఎన్యూ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీల్లో జరిగిన పరిణామాలు దీనినే స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో ని శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతపైన, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణపైన సభ్య సమాజం తలదించుకునే విధంగా సోషల్ మీడియాలో ఈ శక్తులు మానసిక దా డికి, విద్యార్థులపై భౌతిక దాడులకు తెగబడ్డాయి. ఈ శక్తులు విద్యాసంస్థలను మనువాద బ్రహ్మణీయ భావజాలపు కేంద్రాలుగా పునరుద్ధరించడానికి, తమ తాత్విక, సైద్ధాంతిక నిర్దేశకాలుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. విద్యా కాషాయీకరణ పేరుతో చరిత్రను తిరగరాయడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 'భారతీయ ఇతిహాస్ సంకలన యోజన సంస్థ' ఐదువేల సంవత్సరాల భారతీయ చరిత్రను తిరగరాసే పనిలో ఉన్నది. 'భారతీయ అధ్యాపక్ పరిషత్' హిందూత్వ సిద్ధాంతంపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే పనిలో ఉంది. చరిత్ర పాఠాలను కాషాయీకరించడానికి బరితెగించాయి ఈ శక్తులు. యూనివర్శిటీల్లోనే కాదు, బాహ్య సమాజంలోనూ భిన్న సామాజిక వర్గాలపైన తమ మతోన్మాద చర్యలను సాగిస్తున్నాయి. అఖ్లాక్ మొదలు, గౌరీ లంకేశ్ వరకూ జరిగిన ఉదంతాలే ఇందుకు నిదర్శనం. ప్రాథమిక స్థాయిలో విద్యాభివృద్ధికి భిన్న సామాజిక వర్గాలకు విద్యావకాశాలను అందుబాటులోకి తేవడానికి అవసరమైన నిధుల కేటాయింపు, మౌలిక వసతులను సమకూర్చడం, బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు చేపట్టడం వంటి విషయాలలో పాలకులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఫీజుల రూపకల్పనకు, నియంత్రణకు సమగ్రమైన చట్టం లేదు. బోధన ప్రమాణాల పెంపుకు ఉపాధ్యాయులకు అసరమైన ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించే విధానాన్ని వదిలివేశారు. విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణ విధానాలకు తెరలేపి వాటి అమలులో నిమగమైన పాలకులు ఈ విషయాన్ని పట్టించుకోరు. అందరికీ విద్య, సమానత్వంతో కూడిన విద్య అందుబాటులోకి రావాలంటే విద్యార్థులు సంఘటితపడి నిర్మాణాత్మకమైన ఉద్యమాలలో భాగస్వామ్యం అయినప్పుడే సాధ్యమవుతుంది.
- ఏ.డి.రాము
సెల్ : 9704189282