Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంక్రాంతి దక్షిణ భారతంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆంగ్ల సంవత్సరం తర్వాత వచ్చే మొదటి తెలుగు పండుగ. ఇది ఆంధ్రలో మూడు రోజులు, తెలంగాణలో ఒకటి లేదా రెండు రోజులు జరుపుతారు. ఈ పండుగకు పది దినాల ముందునుండే గ్రామాల్లో వాకిళ్లు రంగురంగుల ముగ్గులతో ముస్తాబవుతాయి. ఈ పండుగ రోజు ప్రతి ఇల్లూ పచ్చని తోరణాలతో కళకళలాడుతాయి. పై మాటలన్నీ పుస్తకాలు, పేపర్లలో చదివిన విషయాలు మాత్రమే. నేను చూసినా, చూస్తున్న, అనుభవించిన సంక్రాంతి మాత్రం వేరు. వాటిని తెలంగాణ సమాజానికి క్రోడికరించే ప్రయత్నం చేస్తా...
నా చిన్నప్పుడు మాకున్న ఆర్థిక స్తోమతకీ, లాగుకి రెండు ట్యూబ్ లైట్ల(బొక్కలు)తో, చీమిడి కారుస్తూ సంక్రాంతి అనగానే నాకు గుర్తొచ్చేది పతంగులు (గాలిపటాలు). అవంటే నాకు తెగ మోజు, వాటిని కొనడానికి మాయమ్మను, అయ్యను గోకిన సోట గోకకుండా గోకితే మాయమ్మ కాదనకుండా రెండు రూపాలిస్తే, ఒక్క రూపాయితో పతంగి, ఇంకో రూపాయితో దారపుండ కొనేటోన్ని. దాన్ని తీసుకొని నా దోస్తుగాళ్లతో చెరువుగట్టు మీద ఎగరేయనీకే పోయోటోన్ని. అప్పుడు అవి డొల్కలు కొట్టుకుంటూ దారం తెగిపోతే, దాన్ని పట్టుకునేందుకూ చేసే యాతనలో ఉండే సంతోషమే ''సంక్రాంతి''. అయితే, ఇవన్నీ చెప్పడానికి కారణం ఇప్పటికీ నా చిన్నప్పుడు నేనున్నా ఆర్థిక స్తోమతలో చాలా మందున్నారు. అంటే ఏం మారింది అప్పటికీ, ఇప్పటికీ? డబ్బులున్నోడికి రోజూ పండుగే. దానికి సంక్రాంతి, గింక్రాంతి అవసరంలే. తెలంగాణలో గత మూడేండ్లుగా చాలీచాలనీ వానలతో పనులు లేక, వ్యవసాయం చేయలేక, పంటలకోసం తెచ్చిన అప్పు తీర్చలేక సతమతమవుతున్నారు. అప్పుల బాధతో ప్రాణాలు తీసుకుంటున్నారు. వాన లేదని ఊరుకోకుండా ఆశతో బరు వెక్కిన గుండెల్లో ఏ మూలనో ఉన్న కోరికతో బోర్ల మీద బోర్లు(బోరుబావి) వేస్తూ, అప్పు ల పాలవుతుండ్రు. ఇలా అప్పుల ఊబిలో మూలుగుతున్న రైతన్నకి ఏ పండుగొచ్చిన ఒకటే... ముఖ్యంగా తెలంగాణ రైతుల బాధని అర్థంచేసుకునే పరిస్థితిలో నేటి ప్రభు త్వాలు లేవు. కానీ, ఈ సంక్రాంతి మాత్రం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే? ఈ సంక్రాంతికి ఐదేండ్లకోసారొచ్చే కపట రాజకీయ జూదం కదా! ఈ రాజకీయ పోరులో జనాలను ఆకర్షించేందుకు నాయకులు ఎన్నో పాట్లు, ఫీట్లు పడుతు న్నారు. దానికోసం తాగేటోనికి మందు, తాగనోనికి డబ్బులాశ సూపెడుతుండ్రు. ఏదై తేనేం, అందరూ దొంగలే కదా! ''సచ్చినోడి పెండ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు'' ప్రజలు వ్యవహరింస్తుండ్రు. ఎట్లయితేనేం ఈ కష్టకాలంలో ఈ పండుగకన్నా ఐదు వేళ్లు నోట్లో కి పోతున్నందుకు ఒకవైపు ఆనందం, ఇంకోవైపు వారి ప్రలోభాలకుగురై అక్కడక్కడా గ్రామశ్రేయస్సు కోసం నిలబడే నాయకులకు ఓటెయ్యరేమో అనే భయముంది. కాని ఏదేమైన గ్రామ శ్రేయస్సుకోసం పాటుపడే వారినే ఎన్నుకోవాలన్నదే నా ఆశ. వారివల్లే ఊరు బాగుపడుతదానేది మరవొద్దు.
- సావిత్రి శ్రీశైలం
సెల్ : 9247343947