Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ చట్టం(ఇగ్నో చట్టం) ద్వారా 1985 నవంబర్ 19న స్థాపించబడిన ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీని 'ఇగ్నో' అని కూడా పిలుస్తారు. కేంద్ర ప్రభుత్వం అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇగ్నో నాలుగు మిలియన్ల కంటే ఎక్కువ మంది విద్యార్థులు, ప్రపంచంలోని అతిపెద్ద విశ్వవిద్యాలయంగా పేరుగాంచింది. ఇగ్నో సమాజంలోని వెనుకబడిన విభాగాలకు, ఉన్నత విద్యా అవకాశాలను అందిస్తుంది. భారతదేశంలో దూర, సార్వత్రిక విద్యను ప్రోత్సహిచటం, సమన్వయం, ప్రమాణాలను నెలకొల్పడం, ఉన్నత దూర విద్య ద్వారా భారతదేశం మానవ వనరులను బలోపేతం చేయడం, బోధన, పరిశోధనలతోపాటు, విస్తరణ శిక్షణ ప్రధాన అంశాలుగా ఇగ్నో పని చేస్తుంది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇగ్నో సేవలు అందిస్తుంది. ఇగ్నోలో మొత్తం 21 పాఠ శాలలు (స్కూల్స్), 67 ప్రాంతీయ కేంద్రాలు, 3667 అధ్యయన కేంద్రా లు, 29 విదేశీ కేంద్రాలు (15 దేశాల్లో) ఉన్నాయి. భారతదేశంలో ఉన్నత విద్యలో చేరిన మొత్తం విద్యార్థులలో సుమారు ఇరవై శాతం మంది ఇగ్నోలో చేరారు. ఇగ్నో, సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ స్థాయిలో కో ర్సులను కలిగి ఉన్న 228 అకాడమిక్ ప్రోగ్రాంలను అందిస్తుంది. దాదా పు 810 అధ్యాపక బందాలు, ప్రధాన కార్యాలయాలు, ప్రాంతీయ కేంద్రా లలో 574 విద్యా సిబ్బంది, అధిక సాంఘిక సంప్రదాయ సంస్థలు ప్రొఫె షనల్ సంస్థలు, పరిశ్రమల నుండి 33,212 విద్యా సలహాదారులు ఉన్నారు.
మన దేశంలో ఏ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి లేని ప్రత్యేకతలు ఇగ్నోకు మాత్రమే ఉన్నాయి. ఆన్లైన్ అడ్మిషన్లు, సకాలంలో ప్రవేశాల ప్రకటనలు, సకాలంలో పరీక్షల నిర్వహణ జరుగుతుంది. ఫలితాలలో జాప్యం ఉండదు. ముందస్తు ఫలితాల వెల్లడి, గ్రేడ్కార్డ్లు సకాలంలో పంపిణీ అంశాలు ఇగ్నో ప్రత్యేకతలు. ఒక అభ్యర్థి ఒక అధ్యయన కేంద్రంలో ప్రవే శం పొందితే దేశంలో ఏ అధ్యయన కేంద్రంలోనైన టర్మ్ ఎండ్ పరీక్షలు రాసుకునే ప్రత్యేక వెసులుబాటు ఇగ్నోలో మాత్రమే ఉంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు వివిధ సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా, యం.ఫిల్, పీహెచ్‌డీలకు సంబందించిన ట్యూషన్ ఫీజులో మినహాయింపు ఇస్తూ బడుగు బలహీన, పేద విద్యార్థుల పాలిట ఒక వరంలా ఇగ్నో కృషి చేస్తుం ది. ఇగ్నోలో స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యం, ఉపాధిని కల్పించే వివిధ సాంకేతిక, ప్రొఫెషనల్ ప్రోగ్రాంలు కూడా ఉన్నాయి. దీనివల్ల వివిధ రాష్ట్రాలలో ఉన్న అభ్యర్థులు వివిధ జాతీయ స్థాయి బహుళార్థక కంపె నీలలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. ఇగ్నో న్యూ ఢిల్లీ క్యాంపస్, వివిధ రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ కేంద్రాలు నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో కూడా అభ్యర్థులు ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. ఈ విషయంలో ప్రాంతీయ కేంద్రాల సంచాలకులు, సహాయ ప్రాంతీయ సంచాలకులు ఇండక్షన్ ప్రోగ్రాంల ద్వారా ఇగ్నో విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ ఆయా రాష్ట్రాలలో దూర విద్య అందరికీ చేరేల కృషి చేస్తున్నారు. ఇగ్నో వివిధ ప్రోగ్రాంలకు సంబందించిన కోర్స్ మెటీరియల్ ప్రపంచస్థాయి విలువలతో కూడిన దేశ, ప్రపంచ స్థాయిలో అత్యున్నత శాస్త్రవేత్తల, అనుభవమైన ఆచార్యులచే రూపకల్పన చేసిన కోర్స్ మెటీరియల్ విద్యార్థులకు అందిచబడుతుంది. ఈ కోర్స్ మెటీరియల్ వివిధ జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరీక్షలకు, పోటీ పరీక్షలకు రెఫరెన్సుగా ఉపయోగపడుతుంది. ఇగ్నో జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం కాబట్టి అన్ని రాష్టాలలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుతో పాటు ఎటువంటి సమస్యలు లేకుండా అభ్యర్థులు అనేక ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు.
మన తెలంగాణలో ఇగ్నో ప్రాంతీయ కేంద్రం హైదరాబాద్‌లో వివిధ అధ్యయన కేంద్రాలు, సాధారణ అధ్యయన కేంద్రాల ద్వారా నిర్వహిం చబడుతుంది. ప్రాంతీయ కేంద్రం అభ్యాసకులు, అధ్యయనం కేంద్రాలు, యూనివర్సిటీ ప్రధాన కార్యాలయాల మధ్య అకాడమిక్, పరిపాలన అను సంధానం ద్వారా వివిధ అభ్యాసన కార్యక్రమాలను సమన్వయపరు స్తుంది. ఉన్నత విద్య బడుగు బలహీనులకు అందిచాలనే లక్ష్యంతో ఇంది రాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం నిరంతరం కషి చేస్తూ ము ప్పై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇగ్నో ఎల్లప్పుడూ ప్రపంచ సార్వత్రిక దూర విద్య ప్రతి గ్రామానికి అందిస్తుందని ఆశిద్దాం!.
- కందగట్ల శ్రవణ్ కుమార్
సెల్ : 86393 74879