Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీఆర్ఎస్లో లోక్‌సభ టికెట్ల దందా ముక్కున వేలేసుకునేలా చేస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అనబట్టిరి. పార్టీలో ఉన్నవారికి, ఉద్యమంలో పోరాడిన వారికి కాకుండా కార్పొరేట్లకు, రియల్టర్లకు టికెట్లు కట్టపెట్టడాన్నీ ఔరా! అని దీర్ఘాలు తీయబట్టిరి. పోటీచేయడానికి, టికెట్లు పొందడానికి టీఆర్ఎస్లో ఎలాంటి ప్రాథమిక అర్హతలేవీ అవసరం లేదని కేటాయించిన తీరును చూస్తే అర్థమవుతున్నదని ఇటు ప్రగతిభవన్, అటు తెలంగాణభవన్‌లో గుసగుసలు జోరుగానే సాగుతున్నయి. పార్టీ ఫండ్ కింద డబ్బులు కడితే చాలు అని అంటున్నవారూ ఉన్నారాయే. లెమ్మంటే లేవాలే, కూకొమ్మంటే కూకోవాలే.. అంతే సుమా. అదే టీఆర్ఎస్ క్యాండిడేట్లకు అర్హత. అయితే కొంతమంది పాత అభ్యర్థులు ఇందుకు ససేమిరా అన్నారట పాపం! వాళ్ల తోకలు కత్తిరించి ఇంటికి పంపించిండంట పెద్దసారూ. ఇదిప్పుడు గోల గోలగుంది బయట. ఏదేమైనా రాజు తలుచుకుంటే... దెబ్బలకు కొదువా అని చెప్పాల్న.. అందరికీ ఎరుకే కదా..!
- బి.బసవపున్నయ్య1