Authorization
Mon Jan 19, 2015 06:51 pm
10వ తరగతి పూర్తి చేసుకున్న సరిగ్గా పాతి కేళ్ళకు పెద్దగుండవెల్లిలో మిత్రులంతా కలుసుకున్నారు. ఇలా బాల్య మిత్రులు అందరూ ఒక దగ్గర చేరడానికి రాజేష్ ప్రయత్నం మరువలేనిది. అందరి ఫోన్ నెంబర్లను సేకరించి మాట్లాడి, కలుసుకునేందుకు ఏర్పాటు చేశాడు. రాజేష్‌కు చిన్నప్పటి నుంచి సహాయం చేయాలనే గుణం ఉన్నవాడు. అందుకే తనకు తోచింది సహాయం చేసేవాడు.
పాతికేళ్ళకు రాజేష్ చొరవతో, కలుసుకున్న మిత్రుల సంతో షాలకు అవధులు లేకుండా పోయింది. కరచాలనాలు, ఆలిం గనాలు ఆత్మీయ పలకరింపులతో ఆ ప్రాంతం స్నేహమనే జడివానలో తడిసి ముద్దయింది. పలకరింపులు పూర్తయ్యాక, రాజేష్ స్నేహితులను ఒక్కొక్కర్ని ముందుకు వచ్చి తమ తమ పరిచయాలను చెప్పమన్నాడు. అందరూ పాతికేళ్లలో జరిగిన అనుభవాలు కష్టసుఖాలు ప్రస్తుత పరిస్థితి చెప్పుకున్నారు. మధ్యలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానం చేసుకున్న మిత్రుడు రామ్ రెడ్డిని గుర్తు చేసుకుని సంతాపం భాష్పాలు రాల్చారు.
చివరగా లచ్చన్న మాట్లాడుతూ, మిత్రులారా ఇప్పుడూ మనం అంతా సంతోషంగా ఉన్నాం. కానీ మన బాల్యం నేస్తం రాజయ్య లివరు చెడిపోయి, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడు తున్నడు. కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలి అన్నాడు .అందుకు రాజేష్ వెంటనే తన పర్స్‌లో ఉన్న 10,000 రూపాయలు టేబుల్‌పై పెట్టి, మీరు కూడా మీ దగ్గర ఎంత ఉంటే అంత ఒక దగ్గర పోగు చేయమన్నాడు. రాజేష్ అనగానే అందరూ తమ దగ్గర ఉన్న డబ్బును ఒక దగ్గర చేర్చితే 50 వేల రూపాయలు జమ అయ్యాయి. అందరూ కలిసి రాజయ్య దగ్గరికి వెళ్లి నీకు మేమున్నామని భరోసా కల్పించి, 50వేల రూపాయలు అందించారు. తన పట్ల మిత్రులకు ఉన్న ఔదార్యాన్ని చూసి ఆనంద భాష్పాలు రాల్చాడు రాజయ్య.
- యాడవరం చంద్రకాంత్ గౌడ్
9441762105